Ketu Transit 2024 In Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కేతు గ్రహాన్ని అశుభగ్రహంగా పరిగణిస్తారు. అందుకే ఈ గ్రహం జాతకంలో అశుభస్థానంలో ఉన్న వారికి అనేక సమస్యలతో పాటు ఆరోగ్యం కూడా చెడిపోతూ ఉంటుంది. అయితే ఈ గ్రహం సంచారం, తిరోగమనం చేసినప్పుడు కూడా అన్ని రాశుల వారిపై ప్రత్యేకమైన ప్రభావం పడుతుంది. దీని కారణంగా జాతకంలో కేతువు గ్రహం శుభస్థానంలో ఉన్నవారికి ఈ సమయంలో లాభాలతో పాటు అదృష్టం కూడా పెరుగుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2024 సంవత్సరంలో కేతువు గ్రహం మీనరాశిలోనే సంచార దశలో ఉంటుంది. ఆ తర్వాత ఈ గ్రహం 2025 మే 18వ తేదీన సింహరాశిలోకి ప్రవేశించబోతోంది. అలాగే ఈ గ్రహం తిరోగమనం కూడా 2025 సంవత్సరంలో సింహరాశిలోనే చేయబోతోంది. దీనికి కారణంగా కొన్ని రాశుల వారికి మిశ్రమ ఫలితాలు కలిగితే మరికొన్ని రాశుల వారికి లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు అయితే ఈ కేతువు తిరోగమనం కారణంగా ఏయే రాశుల వారిపై ఎలాంటి ప్రభావం పడుతుందో ఇప్పుడు తెలుసుకోండి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మిధున రాశి: 
కేతువు గ్రహం 2025 సంవత్సరంలోని సంచారం, తిరోగమనం చేయడం వల్ల మిధున రాశి వారికి ఎంతో లాభదాయకంగా ఉంటుంది. అలాగే వీరు కొన్ని ఆలయాలను సందర్శించే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా సోదరుల నుంచి సపోర్టు లభించి అనుకున్న పనుల్లో వెంట వెంటనే విజయాలు సాధిస్తారు. దీంతోపాటు కార్యాలయాల్లో ఉన్నత అధికారుల సపోర్టు లభించి ప్రమోషన్స్ కూడా పొందే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా వ్యాపారాలు చేస్తున్న వారికి ఈ సమయం చాలా లాభదాయకంగా ఉంటుంది. ఈ సమయంలో వీరు కొత్త పెట్టుబడులతో పాటు అనుకున్న డీలింగ్ సన్నీ చేయగలుగుతారు. అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి ఈ సమయంలో కొంత ఉపశమనం లభించి విశ్రాంతి కూడా లభిస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.


ధనస్సు రాశి: 
కేతువు సంచార ప్రభావం ధనస్సు రాశి వారిపై కూడా పడుతుంది. దీని కారణంగా ఈ రాశి వారికి జీవితంలో సంతోషం పెరగడమే కాకుండా మతపరమైన విషయాలపై విపరీతమైన ఆసక్తి పెరుగుతుంది. అలాగే వీరు కొన్ని ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించే ఛాన్స్ కూడా ఉంది. ముఖ్యంగా ఉద్యోగాలు చేసే వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉండబోతోంది. అలాగే వ్యాపారాల్లో లాభాలు, మంచి స్థాయి పొందబోతున్నారు. వృత్తి పరమైన జీవితంలో వస్తున్న ఆటంకాలు అన్నీ తొలగిపోబోతున్నాయి. అంతేకాకుండా సామాజిక హోదా పెరిగి కీర్తి, ప్రతిష్టలు కూడా లభిస్తాయి. దీని కారణంగా మనసు ఎంతో ఆనందంగా ఉంటుంది. అలాగే వృత్తి జీవితంలో అనుకున్న పనులు కష్టపడి చేయడం వల్ల విపరీతమైన డబ్బు పొందుతారు. దీంతో పాటు వీరికి ఈ సమయంలో ఒత్తిడి నుంచి పూర్తి విముక్తి లభించి భౌతిక సుఖం కూడా పెరుగుతుంది. అలాగే అత్తమామల నుంచి ఆదాయం పొంది కొన్ని శుభవార్తలు కూడా వింటారు.


ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!


మీనరాశి: 
మీన రాశి వారికి కేతువు సంచారం ప్రభావం కారణంగా బోలెడు లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా వీరు ఈ సమయంలో అనుకున్న పనుల్లో విజయాలు సాధించడమే కాకుండా.. ఆర్థికంగా కూడా అనేక లాభాలు పొందుతారు. అలాగే అనారోగ్య సమస్యల నుంచి సులభంగా విముక్తి లభించి ఎంతో యాక్టివ్గా తయారవుతారు. దీంతోపాటు కెరీర్ కు సంబంధించిన జీవితంలో కూడా అఖండ విజయాలు సాధిస్తారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. దీంతోపాటు వీరికి ఈ సమయంలో వైవాహిక జీవితం చాలా బాగుంటుంది. వీరు ఎలాంటి పనులు చేసిన ఎంత తొందరగా విజయాలు సాధిస్తారు. కానీ కొన్ని విషయాల్లో తప్పకుండా పలు రకాలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే అనేక సమస్యలు వచ్చే ఛాన్సులు ఉన్నాయని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. అలాగే సవాళ్లను తెలివితో పరిష్కరించుకోవాల్సి ఉంటుంది.


ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..


ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి