Pancharanga Temples:ఆదిశేషుని మీద పవళించిన విష్ణుమూర్తి అవతారంగా వైష్ణవులు రంగనాథ స్వామిని ఆరాధిస్తారు. ఎంతో భక్తి శ్రద్ధలతో ఈయనకు పూజలు చేస్తారు. రంగనాథ స్వామి ఆలయాలు దక్షిణ భారతదేశంలో ఎన్నో ఉన్నాయి. వాటిలో ఎన్నో పురాతనమైన ప్రసిద్ధి చెందిన ఆలయాలు కూడా ఉన్నాయి. అయితే రంగనాథ స్వామి కి సంబంధించిన అన్ని ఆలయాలలో పంచరంగ క్షేత్రాలు చాలా ప్రాముఖ్యత కలిగినవి. మరి పంచరంగ క్షేత్రాలు అంటే ఏమిటి ?వాటి విశిష్టత ఎలాంటిదో ? తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పంచరంగ క్షేత్రాలు ప్రధానంగా ఐదు ఉన్నాయి. వాటిలో మొదటిది శ్రీరంగం. శ్రీరంగ రంగనాథుని దివ్య రూపమే చూడని.. అనే పాట శ్రీరంగం గురించి చెప్పగానే గుర్తుకు వస్తుంది. నిజంగానే ఆ రంగడి వైభవం చూడడానికి రెండు కళ్ళు సరిపోవు. శ్రీదేవి ,భూదేవి సహిత రంగనాథ స్వామి ఆలయం కు వేయి సంవత్సరాల పైన చరిత్ర ఉంది. పశ్చిమ గాంగేయుల కాలంలో నిర్మించిన ఈ ఆలయంలోని స్వామి అనుగ్రహం కోసం కర్ణాటక ప్రాంతాన్ని ఏలిన రాజులతో పాటు టిప్పు సుల్తాన్ కూడా ప్రార్థనలు చేశాడు.


ఆ తరువాత క్షేత్రం తమిళనాడులోని తిరుచిరాపల్లి గ్రామం లో ఉంది.ఇక్కడ స్వామి నీ  ‘అప్పకుడతాన్‌ పెరుమాళ్‌’ అని పిలుస్తారు. స్థల పురాణం ప్రకారం అక్కడ ఉభమన్యు అనే ఒక రాజుకి విష్ణుమూర్తి వృద్ధిని రూపంలో దర్శనం ఇచ్చారు. ఆ ముసలి తాత అవతారం చూసి జాలి పడిన రాజు ఆహారం పెట్టాడు. అయితే ఎంత తిన్నా తాత ఆకలి మాత్రం తీరలేదు. ఏం చేయాలో అర్థం కాని రాజుకు పరాశర మహర్షి భక్తిశ్రద్ధలతో అప్పాలు వండి వడ్డించమని సలహా ఇస్తాడు. అలా భక్తిగా పెట్టిన అప్పాలు తిని స్వామి తృప్తి పడి శాంతించాడు. అదిగో అప్పటినుంచి ఆ స్వామికి అప్పకుడతాన్ స్వామి అని పేరు వచ్చింది. 


పంచరంగ క్షేత్రాలలో మూడవది కుంభకోణం. హేమ రుషి ఇక్కడ లక్ష్మీదేవి తనకు కూతురుగా పుట్టాలి అని తపస్సు ఆచరించాడట. మెచ్చిన లక్ష్మీదేవి తటాకంలో కలువల నుంచి ఉద్భవించడంతో ఆమెకు కోమల వల్లి అనే పేరు వచ్చింది. ఇక లక్ష్మీదేవి కోసం తరలి వచ్చిన విష్ణుమూర్తి అవతారని అరవముదన్ లేక  సారంగపాణి అని కూడా పిలుస్తారు. నాలుగవ క్షేత్రం మయిలదుతురై.. ఇక్కడ విష్ణుమూర్తి చంద్రుని తపస్సుకు మెచ్చి అవతరించాడు. ఇక్కడ స్వామిని ‘పరిమళ పెరుమాళ్‌’ అని పిలుస్తారు.


పంచరంగ క్షేత్రాలలో ఐదవది శ్రీరంగపట్న అరంగనాథ స్వామి ఆలయం. ఈ క్షేత్రాన్ని ఆద్యరంగం అంటే చివరి క్షేత్రం గా పిలుస్తారు. విష్ణుమూర్తి చేతిలోని శంఖం రూపంలో కనిపించే ఒక చిన్న ద్వీపం మీద నిర్మితమైన ఆలయం ఇది. ఈ ఆలయంలోని మూర్తిని విభీషణుడు ప్రతిష్టించాడు అని చెబుతారు. విష్ణుమూర్తి ని గోదాదేవి వివాహం చేసుకుంది కూడా ఈ క్షేత్రం లోనే.


Also Read: CM Jagan: గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం జగన్.. ఒక్కొక్కరికి రూ.లక్షన్నర వరకు..!


Also Read: Revanth Reddy: మీ ఆత్మగౌరవాన్ని ఒక ఫుల్ బాటిల్‌కో.. ఐదు వేలకో తాకట్టు పెట్టకండి: రేవంత్ రెడ్డి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook