Lucky Girls Zodiac Signs: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాశులకు, గ్రహాలకు ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా 3 రాశుల అమ్మాయిలకు శుభ సూచకంగా భావిస్తున్నారు. లక్ష్మీదేవి కటాక్షం ప్రాప్తిస్తుందంటున్నారు..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జ్యోతిష్యశాస్త్రంలో ప్రతి రాశి జాతకులకు ప్రత్యేకతలున్నాయి.  ప్రతి వ్యక్తిలో కొన్ని ప్రత్యేకతలు, కొన్ని లోపాలుంటాయి. తమ తమ అదృష్టాల కారణంగా..సఫలీకృతమయ్యారు. కొంతమంది కష్టపడి విజయం సాధిస్తారు. కొన్ని రాశుల అమ్మాయిలు మాత్రం అత్యంత సౌభాగ్యశీలురుగా చెబుతారు. కొంతమంది అమ్మాయిలపై లక్ష్మీదేవి కటాక్షం విశేషంగా ప్రాప్తిస్తుందంటున్నారు. ఆ ముగ్గురికి అంతులేని ధన సంపదలు లభిస్తాయంటున్నారు.


వృషభరాశి అమ్మాయిల వద్ద డబ్బు ఎక్కువగా ఉంటుంది. చాలా ఆలోచించి డబ్బులు ఖర్చు పెడతారు. ఈ జాతకపు అమ్మాయిలు డబ్బులు సంపాదించడంలోనూ, ఖర్చుపెట్టడంలోనూ తెలివిగా ఉంటారు. పూర్తిగా మనీ మైండెడ్‌గా ఉంటారు. వ్యాపారం చేసినా అద్భుతంగా లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగాలు చేసినా ఉన్నత స్థానానికి వెళ్తారు. పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు. లగ్జరీ లైఫ్ గడుపుతారు.


తుల రాశి అమ్మాయిలపై కూడా లక్ష్మీదేవి కటాక్షం ప్రత్యేకంగా ఉంటుంది. జీవితంలో డబ్బు కొరత రానివ్వరు. ఈ అమ్మాయిలు ఏ ఇంట్లో ఉంటే..అక్కడ సుఖ సమృద్ధి లభిస్తుంది. ఈ అమ్మాయిలు కష్టపడటంలో వెనుకంజ వేయరు. అద్భుతంగా డబ్బులు సంపాదిస్తారు. 


మకరరాశి అమ్మాయిలు చాలా అదృష్టవంతులు. ఈ అమ్మాయిలపై లక్ష్మీదేవి కటాక్షం విస్తృతంగా ఉంటుంది. శనిదేవుడి ప్రభావంతో శ్రమజీవులుగా ఉంటారు. కెరీర్‌లో అత్యున్నత స్థానానికి చేరుకుంటారు. డబ్బులు బాగా సంపాదిస్తారు. 


Also read: Dhanteras Saturn Transit : ధనత్రయోదశి రోజున శని గమనంలో మార్పు... ఈ 5 రాశులవారికి ఊహించని ధనం!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.      


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu    


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook