Rudraksha Benefits: రుద్రాక్ష ప్రయోజనాలేంటి, ఎవరు ఏ రుద్రాక్షను ధరించాలి
Rudraksha Benefits: హిందూమతంలో రుద్రాక్షకు అమితమైన ప్రాధాన్యత, మహత్యమున్నాయి. శివుడి కటాక్షం కోసం ధరించే ఈ రుద్రాక్షతో చాలా ప్రయోజనాలున్నాయంటున్నారు జ్యోతిష్య పండితులు.
రుద్రాక్ష అంటే సహజంగానే హిందూమత ఆధ్యాత్మికత గుర్తుకు వస్తుంది. రుద్రాక్ష అనేది శివుడికి ఇష్టమైనది. అందుకే శివుడి కటాక్షం కోరుతూ రుద్రాక్ష తప్పకుండా ధరిస్తుంటారు. ఆ వివరాలు మీ కోసం.
హిందూ పంచాంగాల ప్రకారం రుద్రాక్ష అనేది శివుడి కన్నీటి నుంచి తయారైంది. అందుకే ఇది ధరించడం శుభ సూచకం. రుద్రాక్ష సంబంధం దేవతలు, నవగ్రహాలతో ముడిపడి ఉంటుంది. రుద్రాక్ష ధరించాలంటే కొన్ని నియమాలు తప్పకుండా పాటించాలి. ఏ రాశివారు ఎలాంటి రుద్రాక్ష ధరించాలనే వివరాలు తెలుసుకోవాలి.
ముఖ్యంగా మేషరాశి జాతకులు ఏకముఖ రుద్రాక్షను ధరించాలని పండితులు చెబుతున్నారు. ఏకముఖం కానిపక్షంలో త్రిముఖం లేదా పంచముఖ రుద్రాక్ష కూడా ధరించినా ఫరవాలేదు. ఇక వృషభరాశి జాతకులు 6 ముఖాలు లేదా 14 ముఖాల రుద్రాక్షను ధరించాల్సి ఉంటుంది. ఇలా చేస్తే వారి జీవితంలో శుభసంతోషాలు ప్రాప్తిస్తాయి.
మిధునరాశి వారైతే..రుద్రాక్షను ప్రాణప్రతిష్ట చేసిన తరువాత ధరించాలి, ఈ రాశి జాతకులు 4, 5 లేదా 13 ముఖాల రుద్రాక్షను మాత్రమే ధరించాలి. ఇలా చేయడం వల్ల సౌభాగ్యం ప్రాప్తిస్తుంది. ఇక కర్కాటకరాశివారైతే.. ఏకముఖం, మూడు లేదా ఐదు ముఖాల రుద్రాక్షను ధరించాలి. దీనివల్ల సుఖ సంతోషాలు లభిస్తాయి.
సింహరాశి జాతకులు మాత్రం ఏకముఖం లేదా 3-5 ముఖాల రుద్రాక్షను ధఘరించాలి. కన్యారాశివారు జీవితంలో పాజిటివ్ పరిణామాలు, శివుని కటాక్షం కోసం నాలుగు, ఐదు లేదా 13 ముఖాల రుద్రాక్షను తప్పకుండా ధరించాలి. ఇక తులారాశి జాతకులు 4 లేదా 6 లేదా 14 ముఖాల రుద్రాక్షను ధరిస్తే..అంతా శుభమే కలుగుతుందని నమ్మకం.
వృశ్చికరాశి జాతకులు జీవితంలో అష్ట ఐశ్వర్యాలు, సుఖ సంతోషాల కోసం త్రిముఖం, పంచముఖ రుద్రాక్షను మాత్రమే ధరించాలి. ధనస్సురాశి జాతకులు ఏకముఖం, త్రిముఖం లేదా పంచముఖ రుద్రాక్ష ధరించాలి.
Also read: Shani Margi 2022: మకరరాశిలో శనిదేవుడి కదలిక...ఈ 5 రాశులవారికి తిరుగులేదు ఇక..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook