Surya Gochar 2023:  గ్రహాలు మరియు రాశుల కదలిక ప్రభావం మానవ జీవితంపై ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి నెల ఏవో కొన్ని గ్రహాలు  తమ రాశులను మారుస్తాయి. గ్రహాలకు రాజు అయిన సూర్యభగవానుడు ప్రతి నెలా తన రాశిని మారుస్తాడు. ఇవాళ అంటే ఫిబ్రవరి 13న సూర్యుడు కుంభరాశిలోకి ప్రవేశించనున్నాడు. దీనినే కుంభ సంక్రాంతి అంటారు.  ఇప్పటికే శనిదేవుడి అదే రాశిలో సంచరిస్తున్నాడు. దీని కారణంగా కుంభరాశిలో ఈ రెండు గ్రహాల కలయిక ఏర్పడనుంది. మార్చి 14 వరకు సూర్యుడు ఇదే రాశిలో ఉంటాడు. సూర్యుడు మరియు శని యొక్క ఈ కలయిక కొందరికి అదృష్టాన్ని ప్రకాశింపజేస్తుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సూర్యుడి సంచారం ఈ రాశులకు వరం
వృషభం 
సూర్య సంచారం వృషభ రాశి వారికి శుభ ఫలితాలను ఇస్తుంది. మీ జీవితాల్లో ఆనందం వెల్లివిరుస్తుంది. ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు వస్తాయి. ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. మీ వ్యక్తిత్వం అందరినీ ఆకట్టుకుంటుంది. 
కన్య రాశి
సూర్యుని రాశి మార్పు యొక్క శుభ ప్రభావం కన్యారాశి వారిపై ఉంటుంది. వ్యాపారులు మంచి లాభాలను గడిస్తారు. ఉద్యోగులకు జీతం పెరగడంతోపాటు ప్రమోషన్ లబించే అవకాశం ఉంది. శత్రువులపై విజయం సాధిస్తారు. మెుత్తానికి ఈ సమయం అద్భుతంగా ఉంటుంది. 
కుంభ రాశి
కుంభరాశిలో శని మరియు సూర్యుని కలయిక కుంభరాశివారికి మేలు చేస్తుంది. జీవిత భాగస్వామితో సంబంధాలు బాగుంటాయి. బిజినెస్ విస్తరిస్తుంది. ఉద్యోగులు భారీగా లాభపడతారు. మీ కెరీర్ మునుపటి కంటే అద్భుతంగా ఉంటుంది. 
ధనుస్సు రాశి
సూర్యుడి గోచారం వల్ల ధనుస్సు రాశి వారికి చాలా లాభాలు కలుగుతాయి. ఈ వ్యక్తులు అన్ని రంగాలలో విజయం సాధిస్తారు. ఫ్యామిలీ సపోర్టు లభిస్తుంది. కొత్త్ ఉద్యోగం ప్రారంభించడానికి ఇదే మంచి సమయం. డబ్బు లాభదాయకంగా ఉంటుంది. 


Also Read: Mahashivatri 2023: మహాశివరాత్రి నాడు ఈ వస్తువులు దానం చేస్తే.. ఇక మీ ఇల్లు అంతా డబ్బే డబ్బు..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.      


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook