Kundali Doshalu Remedies: మనం సాధారణంగా జాతక రీత్యా బాగాలేదనో లేదా కుండలిలో దోషాలున్నాయనో వింటుంటాం. కుండలిలో దోషాలు పలు సమస్యలకు కారణమౌతుంటాయి. జ్యోతిష్యంలో కుండలి దోషాలకు ప్రత్యేక పరిష్కారాలున్నాయి..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జ్యోతిష్యశాస్త్రమనేది భవిష్యత్‌లో జరిగేది చెప్పడంతో పాటు కష్టాలు, సమస్యల్నించి గట్టెక్కే మార్గాలు కూడా చెబుతుంది. వాస్తవానికి కుండలి గ్రహదోషమనేది చాలా సమస్యలకు కారణంగా నిలుస్తుంది. ఈ పరిస్థితుల్లో ఈ గ్రహాల దోషాన్ని తొలగించేందుకు నిర్ణీత సమయంలో గట్టెక్కే మార్గాల్ని అనుసరించాలి. లేకపోతే నష్టాలు ఎదుర్కోవల్సి వస్తుంది. జ్యోతిష్యంలో ప్రతి గ్రహం దోషం దూరం చేసే మార్గాలున్నాయి. కొన్ని మార్గాలు చాలా సులభమైనవి. అంటే స్నానం చేసే నీళ్లలో కొన్ని పదార్ధాలు కలపడం ద్వారా గ్రహదోషాలు దూరం చేసుకోవచ్చు. ఏ గ్రహదోషం దూరం చేసేందుకు స్నానం నీళ్లలో ఏం కలపాలనేది తెలుసుకుందాం.


కుండలిలో సూర్యుడు అశుభ స్థితిలో ఉంటే..ఆ వ్యక్తులు నీళ్లలో ఎర్రపూలు, కేసరి, ఇలాచి, గుల్హఠీ వేసి స్నానం చేయాలి. ఇక కుండలిలో చంద్రదోషముంటే..నీళ్లలో తెల్ల చందనం, తెల్ల సుగంధ పూలు, రోజ్ వాటర్ వేసి కలుపుకుని స్నానం చేయాలి. ఇక కుండలిలో మంగళగ్రహ దోషముంటే..విముక్తి పొందేందుకు నీళ్లలో ఎర్రచందనం, బెల్లం వేసి కలుపుకుని స్నానం చేస్తే మంచి ఫలితాలుంటాయి. ఇక కుండలిలో బుధగ్రహ దోషముంటే..నీళ్లలో జాయఫలం, తేనె, బియ్యం కలిపి స్నానం చేయాలి, 


ఇక కుండలిలో గురుగ్రహ దోషముంటే..నీళ్లలో పసుపు ఆముదం, గులర్, సంపెంగ పూలు కలుపుకుని స్నానం చేయాలి. కుండలిలో శుక్ర గ్రహ దోషముంటే..నీటిలో రోజ్ వాటర్, ఇలాచీ, తెల్లపూలు వేసి స్నానం చేయాలి. ఇక కుండలిలో శనిగ్రహ దోషముంటే..జీవితం నాశనమైపోతుంది. విముక్తి పొందేందుకు నీటిలో నల్ల నూవులు, సోంపు, సుర్మా లేదా లోబాన్ వేసి స్నానం చేయాలి. కుండలిలో రాహువు దోషముంటే జదీవితంలో చాలా సమస్యలు ఎదురౌతాయి. దీనికోసం నీళ్లలో కస్తూరీ, లోబాన్ వేసి స్నానం చేయాలి. కేతు ప్రభావం నుంచి కాపాడుకునేందుకు నీళ్లలో లోబాన్, ఎర్ర చందనం కలుపుకుని స్నానం చేయాలి.


Also read: Jupiter Retrograde Effect: గురు గ్రహం మీనరాశిలో వక్రావస్థ, జూలై 29 నుంచి ఆ రాశులకు ఉద్యోగాలు, సంపద, డబ్బు



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook