Kundali Doshalu: మీ కుండలిలో దోషముందా..ఇలా చేస్తే విముక్తి ఖాయం
Kundali Doshalu: జ్యోతిష్యం గురించి మాట్లాడేటప్పుడు తరచూ కుండలి దోషం మాట వింటుంటారు. కుండలి దోషమనేది జీవితంలో చాలా సమస్యల్ని తెచ్చిపెడుతుంటుంది. అయితే జ్యోతిష్యశాస్త్రంలో ఈ సమస్యలకు పరిష్కారమార్గాలున్నాయి..ఆ వివరాలు మీ కోసం..
Kundali Doshalu: జ్యోతిష్యం గురించి మాట్లాడేటప్పుడు తరచూ కుండలి దోషం మాట వింటుంటారు. కుండలి దోషమనేది జీవితంలో చాలా సమస్యల్ని తెచ్చిపెడుతుంటుంది. అయితే జ్యోతిష్యశాస్త్రంలో ఈ సమస్యలకు పరిష్కారమార్గాలున్నాయి..ఆ వివరాలు మీ కోసం..
హిందూమతంలో జ్యోతిష్యశాస్త్రం ప్రకారం కొన్ని సమస్యలు తీవ్రంగా ఇబ్బంది పెడుతుంటాయి. అందులో కీలకమైంది కుండలిలో దోషం. జ్యోతిష్యశాస్త్రంలో తరచూ వినే సమస్య ఇది. కుండలిలో గ్రహదోషమనేది చాలా సమస్యలకు మూలంగా నిలుస్తోంది. కుండలిలో గ్రహదోషాల్ని నివారించేందుకు జ్యోతిష్యశాస్త్రంలో చాలా మార్గాలు కూడా ఉన్నాయి. సరైన సమయంలో ఆ మార్గాల్ని అనుసరిస్తే కచ్చితంగా కుండలిలో దోషాల్నించి విముక్తి పొందవచ్చు.
జ్యోతిష్యంలో ప్రతి గ్రహం దోషం దూరం చేసే మార్గాలున్నాయి. కొన్ని మార్గాలు చాలా సులభమైనవి. అంటే స్నానం చేసే నీళ్లలో కొన్ని పదార్ధాలు కలపడం ద్వారా గ్రహదోషాలు దూరం చేసుకోవచ్చు. ఏ గ్రహదోషం దూరం చేసేందుకు స్నానం నీళ్లలో ఏం కలపాలనేది తెలుసుకుందాం.
కుండలిలో సూర్యుడు అశుభ స్థితిలో ఉంటే..ఆ వ్యక్తులు నీళ్లలో ఎర్రపూలు, కేసరి, ఇలాచి, గుల్హఠీ వేసి స్నానం చేయాలి. ఇక కుండలిలో చంద్రదోషముంటే..నీళ్లలో తెల్ల చందనం, తెల్ల సుగంధ పూలు, రోజ్ వాటర్ వేసి కలుపుకుని స్నానం చేయాలి. ఇక కుండలిలో మంగళగ్రహ దోషముంటే..విముక్తి పొందేందుకు నీళ్లలో ఎర్రచందనం, బెల్లం వేసి కలుపుకుని స్నానం చేస్తే మంచి ఫలితాలుంటాయి. ఇక కుండలిలో బుధగ్రహ దోషముంటే..నీళ్లలో జాయఫలం, తేనె, బియ్యం కలిపి స్నానం చేయాలి,
ఇక కుండలిలో గురుగ్రహ దోషముంటే..నీళ్లలో పసుపు ఆముదం, గులర్, సంపెంగ పూలు కలుపుకుని స్నానం చేయాలి. కుండలిలో శుక్ర గ్రహ దోషముంటే..నీటిలో రోజ్ వాటర్, ఇలాచీ, తెల్లపూలు వేసి స్నానం చేయాలి. ఇక కుండలిలో శనిగ్రహ దోషముంటే..జీవితం నాశనమైపోతుంది. విముక్తి పొందేందుకు నీటిలో నల్ల నూవులు, సోంపు, సుర్మా లేదా లోబాన్ వేసి స్నానం చేయాలి.
అదే కుండలిలో రాహువు దోషముంటే జదీవితంలో చాలా సమస్యలు ఎదురౌతాయి. దీనికోసం నీళ్లలో కస్తూరీ, లోబాన్ వేసి స్నానం చేయాలి. కేతు ప్రభావం నుంచి కాపాడుకునేందుకు నీళ్లలో లోబాన్, ఎర్ర చందనం కలుపుకుని స్నానం చేయాలి. కుండలిలో దోషాల్ని తొలగించేందుకు సరైన సమయంలో నివారణ పద్ధతుల్ని తప్పకుండా పాటించాలని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
Also read: Lakshmi Devi Pooja: ఇంట్లో సుఖ సంతోషాలు, సంపద కావాలంటే ఇలా చేయాల్సిందే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook