Hindu Calendar April 2024: మార్చి చివరి మాసం చేరుకుంది. దీంతో ఫైనాన్షియల్ ఇయర్ కూడా అయిపోతుంది. వచ్చేది ఏప్రిల్ మాసం. ఈరోజు ఈ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగల జాబితా, శుభముహూర్తాలు ఏంటో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2024 ఏప్రిల్ పండుగల జాబితా..
ఏప్రిల్ 1 సోమవారం:  శీతల సప్తమి
ఏప్రిల్ 2 మంగళవారం: కాల అష్టమి
ఏప్రిల్ 5 శుక్రవారం: పాపమోచని ఏకాదశి
ఏప్రిల్ 6 శనివారం: ప్రదోష వ్రతం
ఏప్రిల్ 8 సోమవారం: అమావాస్య
ఏప్రిల్ 9 మంగళవారం: ఉగాది, గుడిపడ్వా
ఏప్రిల్ 11 గురువారం: గౌరి పూజ
ఏప్రిల్ 13 శనివారం: భైశాఖి
ఏప్రిల్ 14 ఆదివారం: యుమున ఛత్
ఏప్రిల్ 17 బుధవారం:  రామనవమి
ఏప్రిల్ 19 శుక్రవారం: కామదా ఏకాదశి
ఏప్రిల్ 21 ఆదివారం: మహావీర్ జయంతి
ఏప్రిల్ 23 మంగళవారం: హనుమన్ జయంతి, చైత్రపౌర్ణమి
ఏప్రిల్ 27 బుధవారం- సంకష్ట చతుర్థి


ఇదీ చదవండి: భార్యాభర్తలు ఒకే ప్లేటులో తినకూడదా? కారణం ఏంటో తెలుసా?


శీతల అష్టమి..
శీతల అష్టమిరోజు శీతల మాతను పూజిస్తారు. ఈ అమ్మవారిని ఆచారబద్ధంగా పూజిస్తారు. ఎండకాలంలోనే శీతల అష్టమి వస్తుంది. 


పాపమోచిని ఏకాదశి..
ఈరోజు విష్ణుమూర్తిని భక్తిశ్రద్ధలతో కొలుస్తారు. ఈరోజు ఆయన్ను పూజించడం వల్ల మన సర్వపాపాలు తొలగిపోతాయి.


ఇదీ చదవండి:  సంకష్టహర చతుర్థి.. వినాయకుని ప్రసన్నం చేసుకోవడానికి ఇదొక్కటే మార్గం..


ఉగాది..
మార్చి 9న ఉగాది రానుంది. దీన్ని ఉత్తరాదిలో గుడిపడ్వాగా కూడా జరుపుకుంటారు. ఈరోజు దుర్గామాత 9 రూపాలను పూజిస్తారు. చైత్ర నవరాత్రులు కూడా ఈరోజు నుంచే మొదలవుతాయి. అమ్మవారి పూజకు శుభముహూర్తం 2024 ఏప్రిల్ 9 మధ్యాహ్నం 12:03 నుంచి 12:54 వరకు ఉంటుంది. 9 రోజులపాటు అమ్మవారిని ఒక్కో అవతారంలో పూజిస్తారు.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.) 

 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook