Lord Hanuman: హిందూమతంలో మంగళవారం (Tuesday) అత్యంత పవిత్రమైన రోజుగా భావిస్తారు. ఈ రోజున హనుమంతుడిని పూజిస్తారు. శివుని అవతారంగా పరిగణించబడుతున్న హనుమాన్ (Lord Hanuman)ను రామభక్త హనుమాన్, బజరంగబలి, పవన్‌పుత్ర, అంజనీ పుత్ర, మారుతీ వంటి పేర్లతో పిలుస్తారు. హనుమంతుడి నామాన్ని భక్తితో జపిస్తే కోరికలు నెరవేరుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మీ జీవితంలో ఏవైనా సమస్యలున్నా..పనిలో ఆటంకాలు ఎదురైనా..డబ్బు సమస్యలు ఉన్నా..మంళవారం నాడు ఈ కింది విధంగా చేస్తే మీకు శుభాలు కలుగుతాయి. 
** ప్రతి మంగళవారం హనుమాన్ ఆలయానికి వెళ్లి... ఆవనూనెతో దీపం వెలిగించి హనుమాన్ చాలీసా పఠించండి.
**  ఈ రోజున అవసరమైన వారికి అవసరమైన వస్తువులను దానం చేయడం ద్వారా డబ్బు సంబంధిత సమస్యలు తొలగిపోతాయని నమ్ముతారు.
**  స్నానం చేసిన తర్వాత ఆవుకు ఆహారం తినిపించడం శుభప్రదమని...వారికి లక్ష్మీ కటాక్షం కలుగుతుందని ప్రతీతి.
** డబ్బుకు లోటు రాకుండా ఉండాలంటే.. 11 మర్రిచెట్టు ఆకులను తీసుకుని, నీటితో శుభ్రం చేయాలి. ఆకులపై గంధంతో 'జై శ్రీరామ్' అని రాయండి. అప్పుడు హనుమాన్ జీ ఆలయంలో ఈ ఆకులను సమర్పించండి. ఇలా చేయడం వల్ల ఆర్థిక సంక్షోభం నుండి బయటపడతారు.


ఈ మంత్రాలను జపించండి...
మీకు పెళ్లి లేట్ అవుతున్నా లేదా పనుల్లో ఇబ్బందులు తలెత్తుతున్న లేదా మీ మనసు ప్రశాంతంగా ఉండాలన్న ఈ కింది మంత్రాలను జపించండి.
>> అప్పుల నుంచి బయటపడాలంటే 'ఓం హనుమంతే నమః' మంత్రాన్ని ఉదయం 108 సార్లు జపించండి.
>> ఆదిదేవ నమస్తుభ్యం సప్తసప్తే దివాకర్ 
>> త్వం రవే తారయ స్వస్మానస్మాత్సంసార సాగరత్ 
>> ఓం నమో హనుమతే రుద్రావతారాయ్ విశ్వరూప అమిత్ విక్రమాయ ప్రకత్పరాక్రమాయ మహాబలాయ సూర్య కోటిసంప్రభాయ రామదూతాయ స్వాహా.


Also Read: Magh Purnima 2022: లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉండాలంటే ఇలా చేయండి..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి