Lord Krishna Favourite Zodiac Sign: హిందూ పురాణాల ప్రకారం ప్రతి ఏడాది భాద్రపద మాసంలోని కృష్ణ పక్ష అష్టమి తిథి రోజుకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఎందుకంటే ఈ రోజునే  శ్రీ కృష్ణ జన్మదినోత్సవాన్ని జరుపుకుంటారు. అలాగే ఈ రోజునే శ్రీ కృష్ణుడు జన్మించారని నమ్ముతారు. దీనిని తెలుగు రాష్ట్రాల్లో  శ్రీ కృష్ణ జన్మాష్టమి అని కూడా అంటారు. ఈ పండగను హిందువు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. అంతేకాకుండా రెండు రోజుల పాటు జరుపుకుంటారు. మొదటి రోజున ఈ పండగను అందరూ జరుపుకుంటే, రెండవ రోజున మాత్రం వైష్ణవులు జరుపుకుంటారు. ఈ సంవత్సరం హిందు క్యాలెండర్‌ ప్రకారం, ఆగస్టు 26న ఈ పండగ వచ్చింది. దీంతో ఈ రోజుకుని మరింత ప్రాముఖ్యత సంతరించుకుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. శ్రీ కృష్ణుడికి కొన్ని రాశులవారికి చాలా ఇష్టమట.. ఈ రాశులవారికి ఆయన అనుగ్రహం లభించింది. కాబట్టి జన్మాష్టమి రోజున కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శ్రీకృష్ణునికి ఇష్టమైన రాశులు ఇవే:
వృషభ రాశి:

కృష్ణునికి ఎంతో ఇష్టమైన రాశుల్లో వృషభ రాశి ఒకటి. వీరికి ఆయన అనుగ్రహం లభించి అన్ని పనుల్లో విజయాలు కలుగుతాయి. అంతేకాకుండా పురోభివృద్ధి కూడా సాధిస్తారని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. దీంతో పాటు క్లిష్ట పరిస్థితుల్లో కూడా సులభంగా విజయాలు సాధించే శక్తిని పొందుతారు. 


కర్కాటక రాశి: 
కర్కాటక రాశివారికి కూడా శ్రీ కృష్ణుడి అనుగ్రహం లభిస్తుంది. దీని కారణంగా వీరికి ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. అంతేకాకుండా నిత్య జీవితంలో వస్తున్న సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. అలాగే ఎలాంటి అనారోగ్య సమస్యల నుంచైనా విముక్తి కలుగుతుంది. 


సింహరాశి:


శ్రీకృష్ణుడుకి ఎంతో ఇష్టమైన రాశుల్లో సింహరాశి ఒకటి. ఈ రాశులవారు ఆయన అనుగ్రహం పొంది ధైర్యవంతులవుతారు. అంతేకాకుండా కృష్ణుడికి ప్రత్యేకమైన పూజలు చేయడం వల్ల కోరుకున్న కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయి. దీంతో పాటు పనుల్లో వస్తున్న ఆటంకాలు కూడా తొలగిపోతాయి. 


తులారాశి:
తులారాశివారికి కూడా శ్రీకృష్ణుని అనుగ్రహం లభించి అనుకున్న పనుల్లో విజయాలు సాధిస్తారు. అంతేకాకుండా ఎలాంటి పనుల్లోనైనా విపరీతమైన డబ్బును పొందుతారు. అలాగే అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి. దీంతో పాటు అనుకున్న పనులు కూడా సులభంగా చేయగలుగుతారు. 


ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..


ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.