Lucky Zodiac Sign For New Year 2023: కొత్త సంవత్సరం ప్రారంభం కావడానికి ఇంకా 24 గంటల సమయం మాత్రమే ఉంది. 2023 ఏడాది తమకు కలిసి రావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. నూతన సంవత్సరం ప్రారంభంలో కొన్ని ముఖ్యమైన గ్రహాలు తమ రాశులను మార్చనున్నాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, 2023 సంవత్సరం మూడు రాశులకు శుభప్రదంగా ఉండనుంది. వీరికి లక్ష్మీదేవి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ధనుస్సు రాశిచక్రం (Sagittarius): 2023లో ధనుస్సు రాశి వారికి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. జనవరిలో శని మహాదశ నుండి వీరు విముక్తి పొందనున్నారు. మీరు ఆర్థికంగా బలపడతారు. మీలో ధైర్యం మరియు శక్తి పెరుగుతాయి. వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి. పూర్వీకుల ఆస్తి నండి మీరు ప్రయోజనం పొందుతారు. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. 


మకర రాశిచక్రం (Capricorn): మకర రాశి వారికి ఏడాది పొడవునా లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయి. ఎందుకంటే ఒకవైపు శనిదేవుడు మీ జాతకంలో రెండవ ఇంట్లో సంచరిస్తాడు. కాబట్టి అదే బృహస్పతి మీ రాశి నుండి నాల్గవ ఇంట్లో ప్రయాణిస్తాడు. దీని కారణంగా మీరు ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. మీరు కెరీర్ లో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఉద్యోగం సాధిస్తారు. 


మేష రాశిచక్రం (Aries): నూతన సంవత్సరంలో ఈ రాశివారికి మాత లక్ష్మీ కటాక్షం ఉంటుంది. మీరు డబ్బును ఆదా చేస్తారు. మీ ఆదాయం రెట్టింపు అవుతుంది. ఎందుకంటే శని దేవుడు మీ జాతకంలో 11వ ఇంట్లో సంచరిస్తాడు. అందుకే ఈ సంవత్సరం మీకు కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. మీరు జీవితంలోని అన్ని రకాల సుఖాలను పొందుతారు. పెళ్లికానీ యువతీయువకులకు వివాహం కుదిరే అవకాశం ఉంది. 


Also Read: Vasant Panchami 2023: వసంత పంచమి ఎప్పుడు? ఈ పండుగ విశిష్టత ఏంటి? 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.