Lunar Eclipse 2022: చంద్ర గ్రహణం తస్మాత్ జాగ్రత్త, ఈ రాశులపై తీవ్ర ప్రభావమే మరి
Lunar Eclipse 2022: చంద్ర గ్రహణం నవంబర్ 8న ఏర్పడనుంది. ఈ ఏడాదిలో రెండవ చివరి గ్రహణమిది. చంద్ర గ్రహణం ప్రభావం అన్నిరాశులపై పడనుంది. ఆ వివరాలు మీ కోసం.
చంద్ర గ్రహణం సమీపిస్తోంది. ఇప్పట్నించే అప్రమత్తం కావాలి. ఈ ఏడాది చివరి చంద్ర గ్రహణం నవంబర్ 8న ఏ రాశిపై ఎలాంటి ప్రభావం పడుతుందో తెలుసుకుందాం. కొన్ని రాశుల జాతకులు సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది..
ఈ ఏడాది ఆఖరి చంద్ర గ్రహణం నవంబర్ 8వ తేదీన ఏర్పడనుంది. ఇది మేషరాశిపై పడుతుంది. గ్రహణం మద్యాహ్నం 2 గంటల 39 నిమిషాల్నించి ప్రారంభమై...సాయంత్రం 4 గంటల 29 నిమిషాల వరకూ ఉంటుంది. గ్రహణం సాయంత్రం 6 గంటల 19 నిమిషాలకు ఉంటుంది. చంద్ర గ్రహణం సూతక కాలం ఉదయం 5 గంటలు 39 నిమిషాల్నించి ఉంటుంది. ఏ రాశిపై ఎలాంటి ప్రభావం పడనుందో తెలుసుకుందాం.
మేషరాశి జాతకులకు మానసిక సంఘర్షణ ఉంటుంది. అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రక్తపోటు సమస్యలున్నవారు జాగ్రత్తగా ఉండాలి. తల్లి ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఉద్యోగస్థులు జాగ్రత్తగా ఉండాలి. ఆఫీసులో పదోన్నతి, ఇంక్రిమెంట్ వాయిదా పడవచ్చు. వ్యాపారులకు ఇబ్బందులు తప్పవు.
వృషభరాశివారికి ప్రయాణ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదాలు ఎదురుకావచ్చు. చాలా అప్రమత్తత అవసరం. ఖర్చులు అధికమౌతాయి. అనవసర ఖర్చులకు దూరంగా ఉండాలి.
మిధున రాశివారికి ఆర్ధికంగా జాగ్రత్త ఉండాలి. ఎవరికీ అప్పు ఇవ్వవద్దు. ఉద్యోగంలో ఇంక్రిమెంట్లు నిలిచిపోతాయి. సమస్యలున్నప్పుడు ఆందోళన చెందవద్దు.
కర్కాటకరాశివారు కెరీర్‌పై శ్రద్ధ పెట్టాలి. ఒకవేళ ఉద్యోగం మారాలనుకుంటే..కొత్త ఉద్యోగం విషయంలో ఒకటికి రెండుసార్లు పరిశీలించుకోవాలి. కొన్నిసార్లు పనిచేయలేని పరిస్థితి ఉంటుంది.
సింహరాశివారికి పనులు నిలిచిపోతాయి. వ్యాపారులు తమ వ్యాపారంపై శ్రద్ధ పెట్టాలి. ఇంట్లో వృద్ధులకు సేవలు చేయాలి
కన్యారాశివారు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. కడుపులో సమస్యలు రావచ్చు. ఫలితంగా తలనొప్పి బాధించవచ్చు. దీర్ఘకాలంగా అనారోగ్యంతో ఉన్నవారు..మరింత దృష్టి పెట్టాలి.
తులరాశివారు జీవిత భాగస్వామిని జాగ్రత్తగా ఎంచుకోవాలి. జీవిత భాగస్వామి ఆరోగ్యం వికటించవచ్చు. వ్యాపార భాగస్వామితో సంబంధాలు వికటించవచ్చు. వ్యాపారంలో పారదర్శకత అవసరం.
వృశ్చిక రాశివారు లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అప్పు తీసుకోవడం తలనొప్పిగా పరిణమించవచ్చు. వచ్చే ఆరు నెలల కోసం తీసుకున్న రుణం మీకు సమస్యగా మారవచ్చు.
ధనస్సు రాశివారు పిల్లల్ని సంస్కారవంతులుగా చేయాల్సి ఉంటుంది. ఈ విషయంపై దృష్టి పెట్టాలి. గర్భిణీ మహిళలు ఆరోగ్యంపై దృష్టి అవసరం.
మకరరాశి జాతకులకు ఆఫీసులో ఇబ్బంది రావచ్చు. పని విషయంపై బయటకు వెళ్లే పరిస్థితి ఉంటుంది. బదిలీ కూడా జరగవచ్చు.
కుంభరాశి జాతకులకు చిన్న చిన్న విషయాల్లో సంబంధాలు చెడిపోవచ్చు. ముఖ్యంగా కుటుంబసభ్యులతో జాగ్రత్త అవసరం.
మీనరాశి జాతకులు తమ వాయిస్‌పై నియంత్రణ ఉంచాలి. ఇంట్లో వివాదాలు తలెత్తవచ్చు. చిన్న చిన్న విషయాల్ని పెరిగి పెద్దది చేయవద్దు. కోర్టు వ్యవహారాలుంటాయి.
Also read: Chandra Grahan 2022: దేవ్ దీపావళి నాడు చంద్రగ్రహణం... 12 రాశులపై గ్రహణ ప్రభావం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook