Lunar Eclipse 2024: చంద్రగ్రహణ టైంలో గర్భిణీ స్త్రీలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసా?
Grahan Tips for Pregnant Ladies: మరో పది రోజుల్లో చంద్రగ్రహణం సంభవించబోతుంది. అయితే ఈసారి చంద్రగ్రహణం హోలీ పండుగ నాడు ఏర్పడబోతుంది. అయితే ఈ గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రేలీ కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి.
Chandra Grahan 2024 Effect on Pregnancy: ఆస్ట్రాలజీలో గ్రహణాలను అశుభకరంగా భావిస్తారు. ఈ గ్రహణ సమయంలో కొంత నెగిటివ్ ఎనర్జీ విడుదల అవుతుందని.. అది ప్రజలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ప్రజల నమ్మకం. ఏడాది తొలి చంద్రగ్రహణం హోలీ రోజున అంటే మార్చి 25న సంభవించబోతుంది. ఈ గ్రహణ కాలంలో గర్భిణీ స్ట్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈసమయంలో గర్భిణీలు ఇంటి నుండి అస్సలు బయటకు రాకూడదని చెబుతారు. ఇది వారి ఆరోగ్యంపైనా, పుట్టబోయే బిడ్డపైనా ప్రతికూల ప్రభావం చూపుతుందని ప్రజల నమ్మకం.చంద్రగ్రహణం సమయంలో గర్భిణీ స్త్రీలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోండి.
గ్రహణం సమయంలో బయటకు వెళ్లొద్దు..
చంద్రగ్రహణం సమయంలో గర్భిణులు బయటకు రాకూడదు. ఎందుకంటే గ్రహణం యొక్క కాంతి గర్భిణీ స్త్రీలు, పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
పదునైన వస్తువులు ఉపయోగించకూడదు..
ఈసారి చంద్రగ్రహణం మార్చి 25 ఉదయం 10:24 నుండి మధ్యాహ్నం 3:01 గంటల వరకు ఉంటుంది. అంటే గ్రహణం మొత్తం 4 గంటల 36 నిమిషాల పాటు ఉంటుంది. ఈ సమయంలో గర్భిణీ స్త్రీలు చాలా కేర్ పుల్ గా ఉండాలి. పదునైన వస్తువులు ఉపయోగింగచకూడదు. ఈ సమయంలో కత్తెర, సూదులు, కత్తులు వాడితే పిల్లలపై చెడు ప్రభావం పడుతుందని నమ్మకం.
నిద్ర పోవద్దు..
చంద్రగ్రహణం సమయంలో గర్భిణీలు నిద్రపోకూడదని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. వారు ఈ సమయంలో నిద్రపోతే అది నేరుగా శిశువు యొక్క మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని అంటున్నారు. ఈ టైంలో వీలైతే గర్భిణీలు భగవానామస్మరణ చేయడం వల్ల మేలు జరుగుతుందని చెబుతున్నారు.
(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Holi 2024: హోలీకి ముందు ఈ 5 రాశులకు ఇబ్బందులు.. మీ రాశి ఉందా?
Also Read: Hindu new year 2024: ఉగాది నాడు మూడు శుభయోగాలు... ఈ 3 రాశులకు లక్ష్మిదేవి కటాక్షం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి