Lunar Eclipse 2022: దేవ్ దీపావళి నాడు చంద్రగ్రహణం.. ఈ మూడు రాశులవారి లైఫ్ కష్టాలమయం..
Lunar Eclipse 2022: ఆస్ట్రాలజీ ప్రకారం, నవంబర్ 8న చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ గ్రహణం 3 రాశుల వారికి ఇబ్బంది కలిగించనుంది.
Lunar Eclipse 2022: రీసెంట్ గా దీపావళి రోజున సూర్యగ్రహణం ఏర్పడింది. ఇప్పుడు మళ్లీ దేవ్ దీపావళి రోజున చంద్రగ్రహణం ఏర్పడబోతుంది. నవంబరు 8న ఏర్పడబోయే చంద్రగ్రహణం (Chandra Grahanam 2022) ఈ ఏడాది చివరది మరియు సంపూర్ణ గ్రహణం. ఈ గ్రహణం మేషరాశిలో ఏర్పడబోతుంది. దీని ప్రభావం అన్ని రాశులవారిపై కనిపిస్తుంది. ఈ సమయంలో మూడు రాశులవారికి జాగ్రత్తగా ఉండాలి. ఆ దురదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.
చంద్రగ్రహణం సమయం
చంద్రగ్రహణం ప్రారంభం: మధ్యాహ్నం 2:39 గంటలకు ప్రారంభం
చంద్రగ్రహణం ముగింపు: సాయంత్రం 6.19 గంటలకు
ఏయే దేశాల్లో కనిపిస్తోంది?
సూర్యుడు మరియు చంద్రుని మధ్య భూమి వచ్చినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. సూతక కాలం 9 గంటల ముందు ప్రారంభమవుతుంది. అలాగే ఈ చంద్రగ్రహణం భారతదేశంతో పాటు ఆస్ట్రేలియా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, రష్యా, చైనా, పాకిస్తాన్, శ్రీలంక, నేపాల్ మరియు జపాన్ మొదలైన దేశాల్లో కూడా కనిపిస్తుంది.
మేషం (Aries): చంద్రగ్రహణం మీకు కొంత బాధను కలిగిస్తుంది. ఎందుకంటే ఈ గ్రహణం మీ రాశిలో మాత్రమే జరగబోతోంది. కాబట్టి, ఈ సమయంలో వ్యాపారంలో కొత్త ఒప్పందాలు చేసుకోకుండా ఉండండి. ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా వాహనం నడపండి. మీరు ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది.
వృషభం (Taurus): చంద్రగ్రహణం మీకు హానికరం. కాబట్టి ఈ సమయంలో లావాదేవీలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. లేకపోతే నష్టం జరగవచ్చు. అలాగే ఈ సమయంలో వ్యాపారంలో తక్కువ లాభం ఉండవచ్చు. వ్యాపారం నెమ్మదిగా సాగుతుంది. కార్యాలయంలో బాస్ లేదా సహోద్యోగులతో వాగ్వాదం ఉండవచ్చు.
కన్య (Virgo): చంద్రగ్రహణం మీకు ఆర్థిక నష్టాన్ని కలిగిస్తుంది. ఈ సమయంలో మీరు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మంచి ఆహారాన్ని తీసుకోండి. ఏదైనా ముఖ్యమైన పని జరగకుండా ఆగిపోయే ప్రమాదం ఉంది. అలాగే జీవిత భాగస్వామితో విడిపోవడానికి అవకాశం ఉంది.
Also Read: Planet Changes November 2022: నవంబర్‌లో 5 గ్రహాల రాశి మార్పు... ఈ రాశులకు ప్రత్యేకమైన ప్రయోజనం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook