Mauni Amavasya 2023: మౌని అమావాస్య నాడు మౌనంగా ఉండటం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసా?
Mauni Amavasya 2023: మరో నాలుగు రోజుల్లో మాఘ అమావాస్య వస్తుంది. ఈరోజున మౌన వ్రతం పాటించడం వల్ల మీకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి.
Mauni Amavasya 2023: మాఘమాసంలో వచ్చే అమావాస్యను మౌని అమావాస్య లేదా మాఘ అమావాస్య అంటారు. ఈ సంవత్సరం మౌని అమావాస్య జనవరి 21 శనివారం నాడు వస్తుంది. ఈరోజున గంగానదిలో స్నానం చేయడం వల్ల మీరు చేసిన పాపాల నుండి విముక్తి లభిస్తుంది. శాస్త్రాల ప్రకారం మౌని అమావాస్య (Mauni Amavasya 2023) నాడు మౌన వ్రతం పాటించడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. మౌన ఉపవాసం యొక్క ప్రాముఖ్యత మరియు ప్రయోజనాలను తెలుసుకుందాం.
మౌని అమావాస్య 2023 ముహూర్తం
మాఘ అమావాస్య తేదీ ప్రారంభం - 21 జనవరి 2023, ఉదయం 06:17
మాఘ అమావాస్య తేదీ ముగింపు - 22 జనవరి 2023, తెల్లవారుజాము 02:22.
మౌన వ్రతం ప్రాముఖ్యత
** మౌని అమావాస్య రోజున మౌన వ్రతం పాటిస్తూ.. ఉపవాసం చేయడం వల్ల వ్యక్తి యొక్క అంతర్గత రుగ్మతలు నశిస్తాయి. మీ దోషాలన్నీ తొలగిపోతాయి. ఇంద్రియాలను అదుపులో ఉంచుకునే శక్తి లభిస్తుంది. ఈ రోజున, దానం చేయడం మరియు మౌనంగా ఉండటం వల్ల మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అంతేకాకుండా ఏడు జన్మల పాపాలు నశిస్తాయి.
** మౌని అమావాస్య నాడు మౌనం వహించి పూర్వీకుల శాంతి కోసం నైవేద్యాన్ని సమర్పించడం ద్వారా శ్రీమహావిష్ణువును పూజించడం ద్వారా పితృ దోషం మరియు కాలసర్ప దోషం ముగుస్తుంది. ఈ రోజు మౌనంగా ఉంటూ జపం చేయడం వల్ల మీకు ఎన్నో రెట్లు పుణ్యం లభిస్తుంది.
** మను ఋషి మౌని అమావాస్య నాడు జన్మించాడు. మౌని అమావాస్య నాడు మౌనవ్రతం పాటించలేకపోతే.. పావు గంట మౌనవ్రతం పాటించడం వల్ల మీకు 16 రెట్లు ఎక్కువ ఫలితాలు లభిస్తాయి.
Also Read: Shukra Gochar 2023: శుక్రుడి మీనరాశి ప్రవేశం... ఈ రాశులవారికి లాటరీ తగలడం ఖాయం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook