Magh Guru Pradosh Vrat 2023 Significance: మాఘ మాసం మొదటి ప్రదోష వ్రతం జనవరి 19, 2023 నాడు వస్తుంది. పైగా ఇది గురువారం వస్తుంది కాబట్టి దీనిని గురు ప్రదోష వ్రతం అని కూడా అంటారు. శివ భక్తులకు ప్రదోష వ్రతం చాలా ముఖ్యమైనది. దీంతో మీ అన్ని దోషాలు తొలగిపోతాయి. ప్రదోష వ్రతం సంధ్యా కాల సమయంలో మాత్రమే జరుపుకుంటారు. ఎందుకంటే ఈ సమయంలో మహాదేవుడు కైలాస పర్వతంలో డమరుకం వాగిస్తూ ఆనందంగా నృత్యం చేస్తారు. ప్రదోష వ్రతం సందర్భంగా మీరు తీసుకునే చర్యలు జీవితంలో ఆనందం మరియు అదృష్టాన్ని ఇస్తాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గురు ప్రదోష వ్రతం 2023 ముహూర్తం
మాఘ కృష్ణ త్రయోదశి తిథి ప్రారంభం - జనవరి 19, 2023, మధ్యాహ్నం 01.18
మాఘ కృష్ణ త్రయోదశి తేదీ ముగింపు- 20 జనవరి 2023, ఉదయం 09.59
మాఘ ప్రదోష వ్రత పూజ ముహూర్తం - సాయంత్రం 05:49 - రాత్రి 08:30 (19 జనవరి 2023)


శుభ యోగం
మాఘ మాసంలోని కృష్ణ పక్షంలోని ప్రదోష వ్రతం రోజున ధ్రువ యోగం ఏర్పడుతోంది, ఈ యోగంలో ఏదైనా పని చేస్తే మీకు విజయం లభిస్తుంది. 
ధ్రువ యోగం - తెల్లవారుజామున 02.47 - రాత్రి 11.04 (19 జనవరి 2023)


గురు ప్రదోష వ్రత పరిహారం
** గురు ప్రదోషం రోజున భార్యాభర్తలు కలిసి భోలేనాథ్‌కు బెల్లం మరియు నల్ల నువ్వులతో సాయంత్రం శుభ సమయంలో అభిషేకం చేయాలి. ఇది వైవాహిక జీవితంలో శాంతిని తెస్తుంది. మాఘమాసంలో నువ్వుల వాడకం పుణ్యంగా భావించి శివలింగానికి నల్ల నువ్వులను నైవేద్యంగా పెట్టడం ద్వారా శని, రాహు, కేతు దోషాలు తొలగిపోతాయి. ఇంట్లో ఆనందం మరియు శ్రేయస్సు వస్తుంది.
** ప్రదోష వ్రతంలో నల్ల నువ్వులను దానం చేయడం ద్వారా, ఇంటి ప్రతికూలత పోతుంది. అంతేకాకుండా మీరు దీర్ఘకాలిక వ్యాధుల నుండి బయటపడతారు. శివుడు మరియు శని ఇద్దరూ నల్ల నువ్వులను దానం చేయడం వల్ల వారిద్దరూ సంతోషిస్తారు. 
** గురు ప్రదోష వ్రతం రోజున ఉదయాన్నే ఇంటి పై కప్పు మీద ఒక పిడికెడు నల్ల నువ్వులు వేయండి. పక్షులు ఈ నువ్వులను తింటే, జీవితంలోని దుఃఖాలు క్రమంగా తొలగిపోతాయని అర్థం. ఇది చేయడం వల్ల మీ పేదరికం పోతుంది. 


Also Read: Rath Saptami 2023: రథసప్తమి ఎప్పుడు? ఈ పండుగ విశిష్టత ఏంటి?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.      


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu    


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook