Maha Lakshmi Puja Tips: ఒక్కో దైవిక కార్యక్రమానికి ఒక్కో రకమైన పూజా విధానం ఉంటుంది. ఆయా దేవీ దేవతల పూజలో ప్రత్యేక పూజా సామాగ్రిని వాడుతారు. సిరిసంపదలు కురిపించే మహాలక్ష్మీ పూజలోనూ కొన్ని ప్రత్యేక వస్తువులు ఉపయోగిస్తారు. అందులో గవ్వలు ముఖ్యమైనవి. గవ్వలు లేకుండా మహాలక్ష్మీ పూజ ఉండదు.శాస్త్రాల ప్రకారం దేవతల సముద్ర మథనంతో లక్ష్మీ దేవి జన్మిస్తుంది. సముద్రం నుంచి జనించునందునా లక్ష్మీ దేవి పూజలో గవ్వలు తప్పనిసరిగా వాడుతారు. పసుపు రంగు గవ్వలు లక్ష్మీ దేవికి సమర్పించడం ద్వారా ఆ తల్లి అనుగ్రహం పొందవచ్చు. పసుపు రంగు గవ్వలు లేనిపక్షంలో తెలుపు రంగు గవ్వలు సమర్పించవచ్చు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గవ్వలు ఎలా సమర్పించాలి: 


గవ్వలను పసుపు లేదా కుంకుమ ద్రావణంలో ఉంచాలి. లక్ష్మీ దేవి పూజ సమయంలో ఆ గవ్వలను ఎరుపు వస్త్రంలో చుట్టాలి. అనంతరం ఆ ెరుపు వస్త్రాన్ని మీరు డబ్బులు దాచుకునే ప్రదేశంలో ఉంచాలి. తద్వారా ధనం మీ ఇంటి నుంచి బయటకు వెళ్లదు.


11 గవ్వలతో ఇలా చేస్తే :


శ్రావణ మాసంలో లక్ష్మీ దేవిని పూజించి 11 గవ్వలు సమర్పించాలి. పసుపు వస్త్రంలో ఆ గవ్వలను చుట్టి లక్ష్మీ దేవి చిత్ర పటం ముందు ఉంచాలి. లక్ష్మీ దేవి చిత్ర పటం ఉత్తరం దిశలో ఉండాలి. ఇలా చేస్తే ఉత్తర ధిక్పాలకుడు కుబేరుడి అనుగ్రహంతో ధనం సిద్ధిస్తుంది. 


సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి :


హిందూ శాస్త్రాల ప్రకారం దేవతలు క్షీర సాగర మథనం చేసినప్పుడు కామధేనువు,అశ్వం, ఐరావతం, అమృతం, హాలహలంతో పాటు లక్ష్మీ దేవి జనియించింది. లక్ష్మీ దేవి రాకతో కోల్పోయిన ఐశ్వర్యాన్ని దేవతలు మళ్లీ పొందారు. శాస్త్రం ప్రకారం సముద్రంలో దొరికే గవ్వలకు కూడా ధనాన్ని ఆకర్షించే గుణం ఉంటుంది. కాబట్టి లక్ష్మీ దేవి పూజకు గవ్వలు సమర్పిస్తారు. తద్వారా ఆ ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి.


(గమనిక: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ ఊహలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని నిర్ధారించలేదు.)


Also Read: Lal Darwaza Bonalu LIVE* Updates: అంగరంగ వైభవంగా లాల్ దర్వాజ, అంబర్‌పేట్ బోనాలు...


Also Read: Neeraj Chopra Family: నీరజ్‌ చోప్రా కుటుంబ సభ్యుల సంబరాలు.. ప్రధాని మోదీ అభినందనలు (వీడియో)


స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook