Maha Shivratri Fasting Dos and Donts: పరమ శివుడి అనుగ్రహం పొందడానికి ప్రజలు జరుపుకునే ముఖ్యమైన పండుగ 'మహా శివరాత్రి'. దేశవ్యాప్తంగా ఉన్న హిందువులు జరుపుకునే ప్రధాన పండుగల్లో మహా శివరాత్రి కూడా ఒకటి. మాఘమాసం బహుళ చతుర్దశి నాడు శివుడు లింగ రూపంలో ఉద్భవించినట్లు పురాణాలు చెపుతున్నాయి. లింగోద్భవం జరిగిన రోజే మహా శిరాత్రిగా జరుపుకుంటారు. ఆ పర్వదినం (Maha Shivratri 2023) ఈ ఏడాది ఫిబ్రవరి 18న వచ్చింది. ఎంతో పవిత్రమైన ఈ రోజున శివుడిని ఎంతో భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. శివుడి ఆలయాలకు వెళ్లి పరమ శివుడి అనుగ్రహం పొందుతారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శివ భక్తులు మహా శివరాత్రి రోజున జాగారం, ఉపవాసం చేస్తారు. మహా శివరాత్రి రోజున ఉపవాసం, జాగారంను అత్యంత భక్తి శ్రద్దలతో చేస్తే శివుడు భక్తులకు ఆనందం, శ్రేయస్సును ప్రసాదిస్తాడని ప్రజల నమ్మకం. అందుకే మహా శివరాత్రి రోజున చాలా మంది నిర్జల వ్రతాన్ని ఆచరిస్తారు. నిర్జల వ్రతం అంటే.. మహా శివరాత్రి రోజున భక్తులు నీరు మాత్రమే తాగుతారు. మరికొందరు మాత్రం పండ్లు, పాలు, తృణ ధాన్యాలు తింటూ ఉపవాసం చేస్తారు. ఈ ఉపవాసం మహా శివరాత్రి రోజు ఉదయం ప్రారంభమై.. మరుసటి రోజు ఉదయంతో ముగుస్తుంది. మరుసటి రోజు ఉదయం పూజ చేసిన తర్వాత భోజనం చేసి ఉపవాసం విడిచి పెడతారు. మహా శివరాత్రి ఉపవాసంలో (Maha Shivratri 2023 Fasting Rules) చేయవలసినవి, చేయకూడనివి ఏంటో ఇప్పుడు చూద్దాం. 


Dos For Maha Shivratri:
# మహా శివరాత్రి రోజు ఉదయం స్నానం చేసిన అనంతరం శివ పూజ తరువాత సంకల్ప వ్రతం మొదలవుతుంది.
# ఉపవాసం రోజున బ్రహ్మ ముహూర్తం లేదా సూర్యోదయం ముందుగా లేవాలి.
# ఉపవాసం రోజున స్నానం చేసి.. వీలైతే శుభ్రమైన తెల్లని దుస్తులు ధరించి 'ఓం నమః శివాయ్' అని జపించాలి.
# పూజ రాత్రిపూట జరుగుతుంది కాబట్టి భక్తులు శివ పూజ చేయడానికి ముందు సాయంత్రం రెండోసారి స్నానం చేయాలి.
# శివునికి సమర్పించే నైవేద్యాలలో పాలు, దాతుర పుష్పం, బేల పత్ర, చందనం, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార ఉంటాయి.
# భక్తులు సూర్యోదయం మరియు చతుర్దశి తిథి ముగింపు మధ్య ఉపవాసం ఉండాలి.
# చిలగడ దుంపలు, పండ్లు, పాలు వంటి ఆహార పదార్ధాలను తినవచ్చు.
# సగ్గుబియ్యం కిచిడి, సగ్గుబియ్యం జావా వంటివి అల్పాహారంగా తీసుకోవచ్చు. 


Don'ts for Maha Shivratri:
# ఉపవాస సమయంలో బియ్యం, గోధుమలు మరియు పప్పులు తీసుకోరాదు. 
# ఉపవాస సమయంలో ఉప్పుకు దూరంగా ఉండాలి.
# మాంసాహారం, వెల్లుల్లి, ఉల్లిపాయలకు దూరంగా ఉండాలి.
# మద్యం అస్సలు సేవించరాదు. 


Also Read: King Cobra Man Viral Video: 20 అడుగుల జెయింట్ కింగ్ కోబ్రా.. చూస్తేనే పోసుకుంటారు! ఈ వ్యక్తి ఒట్టిచేతులతో పట్టేశాడుగా


Also Read: Albino Cobra Viral Video: రేర్ అల్బినో కోబ్రా.. చూస్తేనే వణుకుపుడుతుంది.. ఈ వ్యక్తి ఎంత ఈజీగా పట్టాడో


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.