Maha Shivratri 2023 Upay, Do These Simple Remedies on Maha Shivratri: ప్రతి సంవత్సరం వచ్చే మహా శివరాత్రికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. మహా శివరాత్రి పండుగ ఫాల్గుణ మాసంలోని కృష్ణ పక్ష చతుర్దశి రోజున వస్తుంది. శివ భక్తులకు ఈ రోజు చాలా చాలా ప్రత్యేకం. ఈ రోజున పరమశివుడిని మరియు  పార్వతి దేవిని పూజించడం వలన అన్ని బాధలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు. ఈ సంవత్సరం మహా శివరాత్రి పండుగ నేడు (ఫిబ్రవరి 18) ప్రపంచ వ్యాప్తంగా శివ భక్తులు జరుపుకుంటున్నారు. మహా శివరాత్రి రోజున కొన్ని చర్యలు చేయడం వల్ల భక్తుల కోరికలన్నీ నెరవేరుతాయి. ఆ చర్యల ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

# జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. మహా శివరాత్రి నాడు శివ లింగానికి స్వచ్ఛమైన నీటితో అభిషేకం చేయండి. శివ లింగంపై నీటిని సమర్పించేటప్పుడు 'ఓం నమః శివాయ' అనే మంత్రాన్ని పఠించండి. ఆ తర్వాత శివుని ముందు 11 దీపాలు వెలిగించి మీ కోరిక చెప్పండి. దీనితో శివుడు త్వరలో మీ కోరికలన్నీ నెరవేరుస్తాడు.


# వివాహంలో ఆటంకాలు తొలగిపోవాలంటే.. మహా శివరాత్రి రోజు పాలలో కుంకుమ కలిపి శివ లింగానికి అభిషేకం చేయండి. అలాగే  పార్వతి దేవికి ఎరుపు రంగు పుష్పాలను సమర్పించండి.


# జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. మహా శివరాత్రి నాడు 21 బిల్వ పత్ర ఆకులను పగలగొట్టి, వాటిని స్వచ్ఛమైన నీటితో కడిగి గంధంతో ఓం నమః శివాయ అని రాయండి. ఆపై శివ లింగంపై ఈ పత్రాలను పెట్టండి. ఈ పరిహారాన్ని చేయడం వల్ల శివుని అనుగ్రహం మీపై ఉంటుంది.


# శివుని వాహనం ఎద్దు. మహా శివరాత్రి రోజున ఎద్దుకు మేత వేయండి. ఎద్దు లేదా ఆవు ఆశ్రయానికి డబ్బు విరాళంగా ఇవ్వండి. దీని వల్ల జీవితంలో ఎప్పుడూ సుఖ సంతోషాలు ఉంటాయి.


# మహా శివరాత్రి రోజున అవసరమైన వారికి ధాన్యాన్ని దానం చేయడం శ్రేయస్కరం. శివరాత్రి రోజున పేదలకు భోజనం పెట్టండి. ఈ పరిహారం చేయడం వల్ల అన్నపూర్ణ మాత అనుగ్రహం మీపై ఉంటుంది.


# మహా శివరాత్రి రోజున రాగి పాత్రలో స్వచ్ఛమైన నీటిని తీసుకుని నల్ల నువ్వులను కలిపి శివ లింగానికి అభిషేకం చేయండి. ఇలా  వలన శని దోషం తొలగిపోతుంది. అంతేకాదు పూర్వీకుల ఆత్మకు శాంతి కూడా చేకూరుతుంది.


# మహా శివరాత్రి రోజున బొటన వేలు పరిమాణంలో ఉన్న పారద్ శివ లింగాన్ని తీసుకువచ్చి పూజించి.. ఇంటి ఆలయంలో ప్రతిష్టించండి. ఇది మీ ఆదాయాన్ని పెంచుతుంది.


# మహా శివరాత్రి నాడు గోధుమ పిండితో 11 శివ లింగాలను తయారు చేసి.. వాటిని స్వచ్ఛమైన నీటితో అభిషేకించాలి. ఈ శివ లింగాల పరిమాణం బొటన వేలు కంటే ఎక్కువగా ఉండకూడదు. అభిషేకం తరువాత ఈ శివ లింగాలను నదిలో వదిలేయాలి.


# మహా శివరాత్రి రోజు రాత్రి ఇంటి ప్రధాన ద్వారానికి ఇరువైపులా దీపాలు వెలిగించండి. ఇలా చేయడం వలన ఆనందం మరియు శ్రేయస్సు ఉంటుంది. ఈ పరిహారాన్ని చేయడం వల్ల శివుని అనుగ్రహం ఎల్లప్పుడూ మీపై ఉంటుంది.


# వైవాహిక జీవితంలో సంతోషం కోసం మహా శివరాత్రి రోజున శివాలయానికి వెళ్లి పార్వతి దేవికి సుహగ్ పదార్థం సమర్పించండి. ఆ తర్వాత బ్రాహ్మణుడికి లేదా స్త్రీకి దానిని ఇవ్వండి. ఇలా చేస్తే మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.


Also Read: Karachi Terrorist Attack: పోలీసు కార్యాలయంపై తాలిబన్ల దాడి.. కరాచీలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం!  


Also Read: Maha Shivaratri 2023: తెలుగు రాష్ట్రాల్లో మహా శివరాత్రి శోభ.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు!  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.