Maha Shivratri 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మార్చి నెలలోని మొదటి వారంలో అనేక గ్రహాలు రాశి సంచారం చేయబోతున్నాయి. దీని కారణంగా మొత్తం 12 రాశులు ప్రభావితం అవుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. అయితే ఈ గ్రహ సంచారాల కారణంగా జాతకాల్లో గ్రహాలు శుభస్థానాల్లో ఉన్నవారికి మంచి లాభాలు కలిగితే, అశుభస్థానాల్లో ఉన్నవారికి తీవ్ర దుష్ప్రభావాలు కలుగుతాయి. అయితే కొన్ని గ్రహాలు సంచారం చేసినప్పుడు ప్రత్యేకమైన పలు రాశుల వారికి లాభాలు కలుగుతాయి. అలాంటి గ్రహాల్లో బుధ, శుక్ర గ్రహాలు కీలకం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే ఈ గ్రహాలు మార్చి ఏడవ తేదీన రాశి సంచారం చేయబోతున్నాయి. బుధ గ్రహం మీన రాశిలోకి, శుక్రుడు శని రాశిగా పిలవబడే కుంభరాశిలోకి సంచారం చేయబోతున్నాయి. దీనికి కారణంగా కొన్ని ప్రత్యేకమైన రాశుల వారిపై ప్రభావం పడబోతోంది. దీంతో వారు అదృష్టవంతులు అవ్వడమే కాకుండా, ఈ సమయంలో ఊహించని ఆర్థిక లాభాలు పొందుతారని జ్యోతిష్యులు చెబుతున్నారు. అయితే ఈ బుధ శుక్ర గ్రహాల సంచారం కారణంగా ఏయే రాశుల వారికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయే ఇప్పుడు తెలుసుకుందాం.


ఈ రాశుల వారిపై రెండు గ్రహాల ప్రభావం:
మేష రాశి:

ఈ రెండు గ్రహాల రాశి సంచారం కారణంగా మేష రాశి వారికి ఈ సమయంలో మాటల్లో మాధుర్యం పెరుగుతుంది. ఉద్యోగాల్లో వీరు అనుకున్న స్థానాలకు చేరుకోగలుగుతారు. అలాగే వ్యాపారాలు చేస్తున్నవారు ఈ సమయంలో కొత్తగా పెట్టుబడులు పెట్టడం వల్ల విపరీతమైన లాభాలు పొందుతారు. అలాగే భవనాలతో పాటు వాహనాలు కూడా కొనుగోలు చేసే అవకాశాలున్నాయి. అలాగే ఈ సమయంలో విద్యార్థులు కూడా పోటీ పరీక్షల్లో రాణించగలుగుతారు. ఇక వైవాహిక జీవితం గడుపుతున్న వారికి భార్యాభర్తల మధ్య ఉన్న గొడవలు పరిష్కారమై శృంగార భరితమైన జీవితాన్ని పొందుతారు. అంతేకాకుండా ప్రేమ జీవితం కొనసాగిస్తున్న వారికి కూడా ఈ సమయం చాలా కలిసి వస్తుంది.


సింహరాశి:
సింహ రాశి వారికి ఈ గ్రహాల సంచారం కారణంగా అనేక రకాల లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా వీరు ఎలాంటి పనులు చేసిన విజయాలను తప్పకుండా సాధించగలుగుతారు. అంతేకాకుండా సంపాదిస్తున్న డబ్బును కూడా పోగు చేస్తారు. అలాగే కష్టపడి పనిచేయడం వల్ల వీరికి ఎన్నో లాభాలు కలుగుతాయి. అయితే కుటుంబంలో వస్తున్న చిన్న చిన్న సమస్యలు కూడా ఈ సమయంలో పరిష్కారం అవుతాయి. దీంతోపాటు వీరికి ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది. ఎప్పటినుంచో అనుకున్న వాటి నుంచి శుభవార్తలు కూడా పొందుతారు. కారణంగా మనసులో ఉన్న బాధ కూడా ఈ సమయంలో తొలగిపోతుంది. 


కన్యా రాశి:
ఈ సమయం కన్యా రాశి వారికి కూడా చాలా శుభ్రంగా ఉంటుంది ముఖ్యంగా ఇంతకుముందు వస్తున్న అడ్డంకులు తొలగిపోతాయి. అలాగే ఆర్థిక పరిస్థితులు కూడా ఈ సమయంలో మెరుగుపడే అవకాశాలున్నాయి. ఆకస్మిక ధన లాభాలు కూడా పొందుతారు. ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వారికి ఈ సమయం కలిసి వచ్చి ప్రమోషన్స్‌కి దారితీస్తుంది. అలాగే వీరికి మాటల్లో మాధుర్యం కూడా రెట్టింపు అవుతుంది. దీనికి కారణంగా ఎలాంటి వారితో నైనా గొప్పగా మాట్లాడుతారు. అంతేకాకుండా అనారోగ్య విముక్తి లభిస్తుంది.


Also Read Free Fire MAX Free Download: ఫ్రీ డైమాండ్స్‌, కరెన్సీతో Garena Free Fire MAXని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకోండి!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి