Mahalaxmi Vratam 2022: మహాలక్ష్మీ వ్రతం ఎప్పుడు, శుభ సమయం, పూజా విధానం, ప్రాముఖ్యత
Mahalaxmi Vrat 2022 Date: లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే ఇంట్లో దేనికీ లోటు ఉండదు. అందుకే మహాలక్ష్మి వ్రతాన్ని పాటిస్తారు. మహాలక్ష్మి వ్రతం ఎప్పుడు, ఇది ఎన్ని రోజులు జరుపుకుంటారో తెలుసుకుందాం.
Mahalaxmi Vrat Puja Vidhanam: ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవి ఆశీస్సులు తమపై ఉండాలని కోరుకుంటారు. ఇందుకోసం లక్ష్మీదేవిని ఎన్నో విధాలుగా పూజిస్తారు. ఉపవాసాలు ఉండటం, నోములు నోయడం, పారాయణం చేయడం వంటివి చేస్తారు. లక్ష్మీదేవి అనుగ్రహం పొందే మహాలక్ష్మీ వ్రతం (Mahalaxmi Vrat 2022) ప్రారంభంకానుంది. ఈ వ్రతాన్ని 16 రోజులపాటు జరుపుకుంటారు. ఈ పదహారు రోజులు స్త్రీలు ఉపవాసం చేస్తూ...లక్ష్మీదేవిని నియమ నిష్ఠలతో కొలుస్తారు. ఇలా చేయడం వల్ల మీకు ఎప్పుడూ దేనికీ లోటు ఉండదు.
మహాలక్ష్మి వ్రతం ప్రారంభం..
భాద్రపద శుక్ల పక్షం అష్టమి తిథి నుండి మహాలక్ష్మి వ్రతం ప్రారంభమవుతుంది. ఈ వ్రతాన్ని 16 రోజులు పాటిస్తారు. ఈసారి భాద్రపద శుక్ల పక్ష అష్టమి తిథి సెప్టెంబర్ 3వ తేదీ నుంచి ప్రారంభమై.. అశ్వినీ మాసంలోని కృష్ణ పక్ష అష్టమి తిథి నాడు అంటే సెప్టెంబర్ 17న ఉపవాసం ముగుస్తుంది.
శుభ సమయం
ఈసారి భాద్రపద శుక్ల అష్టమి తిథి సెప్టెంబర్ 3వ తేదీ మధ్యాహ్నం 12.28 గంటలకు ప్రారంభమై సెప్టెంబర్ 4వ తేదీ ఉదయం 10.39 గంటలకు ముగుస్తుంది. సెప్టెంబరు 4వ తేదీ నుంచి ఉదయతిథి దృష్ట్యా మహాలక్ష్మి వ్రతం పాటించనున్నారు.
వ్రత కథ
మహాలక్ష్మీ వ్రతం ప్రారంభం వెనుక ఒక పురాణం ఉంది. మహారాజా జియుత్‌కు పిల్లలు లేరు. దీంతో అతడు లక్ష్మీదేవిని ప్రార్థించాడు. అప్పుడు లక్ష్మీదేవి అతడి కలలో కనిపించి....16 రోజులపాటు మహాలక్ష్మి వ్రతాన్ని చేయమని చెప్పింది. ఆ మహారాజా ఈ ఉపవాసాన్ని చేశాడు. దీంతో అతడికి సంతానం కలిగింది. అప్పటి నుంచి ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నారు.
Also Read: కలలో ఈ పువ్వును చూసినట్లయితే... మీకు లక్కే లక్కు, ఇక మీపై డబ్బు వర్షమే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook