Mahalaya Amavasya 2022: పితృ పక్షం సెప్టెంబర్ 10న ప్రారంభమై... మహాలయ అమావాస్యతో ముగుస్తుంది. పూర్వీకుల ఆత్మ శాంతి కోసం పితృ పక్షంలో (Pitru Paksha 2022) శ్రాద్ధ కర్మలు చేస్తారు. ఈ మహాలయ అమావాస్యనే (Mahalaya Amavasya 2022) సర్వ పితృ అమావాస్య అని కూడా అంటారు. ఈ సంవత్సరం మహాలయ అమావాస్య 25 సెప్టెంబర్ 2022 నాడు వస్తుంది. ఈ రోజున పవిత్ర నదిలో స్నానం చేసి చనిపోయిన పూర్వీకులందరికీ తర్పణం, పిండ ప్రదానం, శ్రాద్ధం చేస్తారు. మహాలయ అమావాస్య తేదీ మరియు ప్రాముఖ్యతను గురించి తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మహాలయ అమావాస్య తేదీ, సమయం
మహాలయ అమావాస్య తిథి 25 సెప్టెంబర్ 2022 ఉదయం 3:12 గంటలకు ప్రారంభమై..  26 సెప్టెంబర్ 2022 ఉదయం 3:23 గంటలకు ముగుస్తుంది. మహాలయ అమావాస్య తర్వాత నవరాత్రులు ప్రారంభమవుతాయి.


మహాలయ అమావాస్య ప్రాముఖ్యత
మహాలయ అమావాస్య పితృ పక్షం చివరి రోజు. ఈ రోజున పాలు, నువ్వులు, కుశ గడ్డి కలిపిన నీటితో పితృదేవతలకు పిండ ప్రదానం చేస్తారు. ఈ పిండాలను కాకుల కోసం సమర్పిస్తారు. ఈ అమావాస్య నాడు బ్రాహ్మణులకు అన్నదానం లేదా దానం  చేయడం ద్వారా పూర్వీకుల ఆత్మకు శాంతి చేకూరుతుంది. దీంతో వారు సంతోషించి మీపై వరాలు జల్లు కురిపిస్తారు.  


పితృ పక్షం శ్రాద్ధ తేదీలు: 
ప్రతిపాద శ్రాద్ధ, అశ్వినీ, కృష్ణ ప్రతిపద - 10 సెప్టెంబర్ 2022
అశ్వినీ, కృష్ణ ద్వితీయ - 11 సెప్టెంబర్ 2022
అశ్వినీ, కృష్ణ తృతీయ-12 సెప్టెంబర్ 2022
అశ్వినీ, కృష్ణ చతుర్థి - 13 సెప్టెంబర్ 2022
అశ్వినీ, కృష్ణ పంచమి - 14 సెప్టెంబర్ 2022
అశ్వినీ, కృష్ణ షష్ఠి - 15 సెప్టెంబర్ 2022
అశ్వినీ, కృష్ణ సప్తమి - 16 సెప్టెంబర్ 2022
అశ్వినీ, కృష్ణ అష్టమి - 18 సెప్టెంబర్ 2022
అశ్వినీ, కృష్ణ నవమి - 19 సెప్టెంబర్ 2022
అశ్వినీ, కృష్ణ దశమి - 20 సెప్టెంబర్ 2022
అశ్వినీ, కృష్ణ ఏకాదశి - 21 సెప్టెంబర్ 2022
అశ్వినీ, కృష్ణ ద్వాదశి - 22 సెప్టెంబర్ 2022
అశ్వినీ, కృష్ణ త్రయోదశి - 23 సెప్టెంబర్ 2022
అశ్వినీ, కృష్ణ చతుర్దశి - 24 సెప్టెంబర్ 2022
అశ్వినీ, కృష్ణ మహాలయ అమావాస్య - 25 సెప్టెంబర్ 2022


Also Read: కన్యారాశిలో మూడు గ్రహాల సంయోగం.. ఈ 4 రాశుల వారిని వరించనున్న అదృష్టం... 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook