Mahalaya Amavasya 2022 Date Time: భాద్రపద మాసంలోని కృష్ణపక్షమును మహాలయ పక్షము అంటారు. ఈ పక్షమున అన్ని వర్గాల వారు తమ పెద్దలు మరణించిన తిథిని బట్టి ఆయా తిథులలో తర్పణ శ్రాద్ధకర్మలు చేస్తారు. అందువల్ల దీనిని పితృపక్షం అంటారు. ఈ పితృ పక్షం ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలోని శుక్లపక్ష పౌర్ణమి రోజు నుండి అశ్వినీ మాసంలోని అమావాస్య రోజు వరకు ఉంటుంది. ఈ 15 రోజులు పూర్వీకుల మరణించిన తేదీ ప్రకారం శ్రాద్ధం చేస్తారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పితృపక్షం చివరరోజునే అశ్వినీ అమావాస్య అంటారు. దీనినే సర్వపితృ అమావాస్య, మహాలయ అమావాస్య అని కూడా అంటారు. ఈ మహాలయ అమావాస్య (Mahalaya Amavasya 2022) ఈ ఏడాది సెప్టెంబరు 25న వస్తుంది. మహాలయ అమావాస్య నాడు ప్రజలు పవిత్ర నదుల్లో స్నానం చేసి... తమ పూర్వీకులకు తర్పణం, పిండదానం, శ్రాద్ధం చేస్తారు. తద్వారా పూర్వీకులు మోక్షాన్ని పొందడంతోపాటు జనన మరణ బంధాల నుండి విముక్తి పొందుతారని నమ్ముతారు.


మహాలయ అమావాస్య శుభ సమయం
బ్రహ్మ ముహూర్తం : సెప్టెంబర్ 25 ఉదయం 4:35 నుండి 5:23 వరకు
అభిజీత్ ముహూర్తం: సెప్టెంబర్ 25 ఉదయం 11:48 నుండి 12:37 వరకు
గోధూళి ముహూర్తం: సెప్టెంబర్ 25 సాయంత్రం 06:02 నుండి 6:26 వరకు
విజయ ముహూర్తం: సెప్టెంబర్ 25 మధ్యాహ్నం 2:13 నుండి 3:01 వరకు


Also Read: మీకు కూడా ఈ కలలు వస్తున్నాయా? అయితే మీకు త్వరలో గోల్డెన్ డేస్ రాబోతున్నట్లే... 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu   


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook