Mahashivatri 2023 date: శివారాధనకు మహాశివరాత్రి చాలా ప్రత్యేకమైనది. ఈ సంవత్సరం మహా శివరాత్రి ఫిబ్రవరి 18న వస్తుంది. ఈ పవిత్రమైన పర్వదినాన కొన్ని వస్తువులను దానం చేయడం వల్ల మహాదేవుడు సంతోషిస్తాడు. అంతేకాకుండా ఈ పండుగ శనివారం నాడు వస్తుంది. దీంతో మీకు శనిదేవుడు ఆశీస్సులు కూడా లభిస్తాయి. మహాశివరాత్రి రోజున దానం చేయాల్సిన వస్తువులేంటో ఓసారి తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ వస్తువులను దానం చేయండి
** హిందూ మతంలో గోవును మాతగా కొలుస్తారు. అందుకే మహాశివరాత్రి రోజున గోవుకు రొట్టెలు లేదా మేతను తినిపించండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి. అంతేకాకుండా జీవితంలో పురోగతి ఉంటుంది.
** మహాశివరాత్రి రోజున పాలు మరియు పాలతో చేసిన వస్తువులను దానం చేయడం వల్ల భోలేనాథ్ అనుగ్రహం లభిస్తుంది. మహాదేవుడికి పాలు అంటే చాలా ఇష్టం. అంతేకాకుండా శివుడు చంద్రుడిని తలపై ధరిస్తాడు. పైగా పాలు చంద్రుడికి సంబంధించినవి. ఈ పవిత్రదినాన పాలు డోనేట్ చేయడం వల్ల మీకు అపారమైన డబ్బు లభిస్తుంది. 
** ఈ పండుగ రోజున పేదవారికి బియ్యం, పంచదార, పాలు లేదా ఖీర్ దానం చేయడం వల్ల మీ కెరీర్ దూసుకుపోతుంది. 
** మహాశివరాత్రి రోజున నల్ల నువ్వులను దానం చేయడం వల్ల శనిదేవుడి అనుగ్రహం లభిస్తుంది. అంతేకాకుండా మీ దోషాలన్నీ తొలగిపోతాయి. 
** మహాశివరాత్రి రోజున వస్త్రదానం చేయడం కూడా చాలా మంచిది. ఈ రోజు పేదలకు బట్టలు పంపిణీ చేయడం వల్ల మీకు మేలు జరుగుతుంది. 


Also Read: Mahashivratri 2023: మహా శివరాత్రి ఈ 5 రాశులపై కనకవర్షం కురిపించడం ఖాయం 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook