Malavya Rajyog: మరో 48 గంటల్లో ఈ రాశుల ప్యూచర్ మారనుంది... ఇందులో మీరున్నారా?
Malavya Rajyog: రేపు శుక్ర గ్రహం మాళవ్య రాజ్యయోగాన్ని ఏర్పరచబోతుంది. దీని వల్ల 4 రాశుల వారికి మంచి రోజులు మొదలవుతాయి.
Malavya Rajyog: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, కాలానుగుణంగా గ్రహాల గమనంలో మార్పు వస్తుంది. ప్రేమ మరియు సంపదను ఇచ్చే శుక్రుడు రేపు అంటే ఫిబ్రవరి 15న మీనరాశిలోకి ఎంటర్ అవ్వబోతున్నాడు. దీని కారణంగా రేర్ మాలవ్య రాజయోగం ఏర్పడుతుంది. ఆస్ట్రాలజీలో ఈ యోగాన్ని శుభకరమైనదిగా భావిస్తారు. ఈ యోగం వల్ల ఏ రాశులవారి భవిష్యత్తు ఛేంజ్ అవ్వనుందో తెలుసుకుందాం.
మాలవ్య రాజయోగం ఈ రాశులకు శుభప్రదం
మిథునం
మాలవ్య రాజయోగం మీకు శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే శుక్ర గ్రహం మీ కర్మ స్థానంలో మాళవ్య రాజ్యయోగం చేస్తుంది. ఇదే సమయంలో గురుడు హన్స్ అనే రాజయోగాన్ని చేస్తున్నాడు. దీంతో మీరు అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ పని లేదా వ్యాపార నిమిత్తం బయటకు వెళ్లే అవకాశం ఉంది.
కన్య రాశిచక్రం
మాలవ్య రాజయోగం మీకు అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే వైవాహిక జీవితంలో ఈ రాజయోగం ఏర్పడబోతోంది. అంతేకాకుండా హన్స్ అనే రాజయోగం కూడా ఏర్పడుతుంది. ఈ సమయంలో డబ్బు పెట్టుబడి పెట్టడం వల్ల మంచి లాభాలు ఉంటాయి. మెగుడుపెళ్లాల మధ్య బంధం గట్టిపడుతుంది. ఈ సమయంలో మీ కోరికలన్నీ నెరవేరుతాయి. పెళ్లికాని వివాహం కుదిరే అవకాశం ఉంది.
వృషభ రాశి
శుక్రుని సంచారం వృషభరాశి వారికి మేలు చేస్తుంది. ఎందుకంటే శుక్ర గ్రహం మీ జాతకంలో ఇప్పటికే బృహస్పతి ఉన్న ఐదవ ఇంట్లో సంచరిస్తుంది. దీంతో మీ లవ్ సక్సెస్ అవుతుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. మీరు కెరీర్ లో పురోగతి సాధిస్తారు.
ధనుస్సు రాశిచక్రం
మాలవ్య రాజయోగం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే ఈ రాజయోగం మీ సంచార జాతకంలో నాల్గవ ఇంట్లో ఏర్పడుతుంది. దీంతో మీరు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. మీ ఆర్థిక స్థితి బలపడుతుంది. మీరు ఈ సమయంలో లగ్జరీ వస్తువును కొనుగోలు చేసే అవకాశం ఉంది. పాలిటిక్స్ లో ఉన్నవారికి మంచి పదవి దక్కుతుంది.
Also Read: Solar Eclipse 2023: గ్రహణ సమయంలో ఈ రాశులవారు కేర్ పుల్ గా ఉండాలి, లేకపోతే ఇక అంతే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook