Malavya Rajyoga: శుక్రుడి సంచారంతో అతి శక్తివంతమైన యోగం ఏర్పడబోతోంది..మాళవ్య యోగం ప్రయోజనాలు ఈ రాశుల వారికే..
Malavya Rajyog Benefits: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రుడు సంచారం చేసినప్పుడు కొన్ని ప్రత్యేక యోగాలు ఏర్పడతాయి. ఈ ప్రత్యేక యోగాల కారణంగా రాశుల జాతకాలు శుక్రుడు శుభ స్థానంలో ఉంటే ఆర్థిక లాభాలు, ప్రతికూల స్థానంలో ఉంటే దుష్ప్రభావాలు కలిగే ఛాన్సులు ఉన్నాయి.
Malavya Rajyog Benefits: జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన శుక్ర గ్రహం రేపు రాసి సంచారం చేయబోతోంది ప్రస్తుతం ఈ గ్రహం తులా రాశిలో సంచార దిశలో దశలో ఉంది. గ్రహ సంచారం జరిగిన వెంటనే మాళవ్య యోగం ఏర్పడబోతోందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ యోగం కారణంగా ఇంతకుముందు ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న కొన్ని రాశుల వారు అనేక రకాల ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. ఈ మాళవ్య యోగాన్ని పంచ పురుష యోగాల్లో ఒక యోగంగా పరిగణిస్తారు. కాబట్టి ఈ యోగం ఏర్పడిన వెంటనే కొన్ని రాశుల వారికి ఊహించని లాభాలు కలుగుతాయి. అయితే ఈ యోగ ప్రభావం ఏయే రాశుల వారిపై ఎలా ఉండబోతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ ప్రత్యేక యోగం వృషభ రాశి నుంచి ఇతర రాశిలోకి శుక్రుడు సంచారం చేయడం కారణంగా ఏర్పడబోతోంది. ఈ మాళవ్య యోగం 2024 సంవత్సరం మే 19వ తేదీన కూడా ఏర్పడే ఛాన్స్ ఉన్నాయి. కాబట్టి 2024 సంవత్సరం ఈ శుక్రుడు సంచారం కారణంగా అన్ని రాశుల వారికి శుభప్రదం గానే ఉండబోతోంది. ముఖ్యంగా కొన్ని రాశుల వారు ఈ ప్రత్యేక యోగం ప్రభావం పడి విపరీతమైన లాభాలు పొందుతారు.
Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్
ఈ రాశుల వారిపై ఎక్కువ ప్రభావం చూపుతుంది:
శుక్రుడి సంచారం కారణంగా ఏర్పడే మాళవ్య యోగం కొన్ని రాశుల వారిపై ప్రత్యేక ప్రభావం చూపబోతోంది. ముఖ్యంగా కన్యారాశితో పాటు ఈ సంవత్సరం మిథున రాశి, కర్కాటక రాశుల వారికి ఆర్థికంగా ఎలాంటి లోటు ఉండదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రత్యేక సంచారం కారణంగా కర్కాటక రాశి వారు పెట్టుబడులు పెట్టడం వల్ల ఆశించిన లాభాలు పొందుతారు. అంతేకాకుండా ఊహించని ఆర్థిక లాభాలు పొందే అవకాశాలు కూడా ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. ఇక మిథున రాశి వారికి ఉద్యోగాలు లభించే అవకాశాలు కూడా ఉన్నాయి. కన్యా రాశి వారికి వివాహ అవకాశాలు లభించడమే కాకుండా ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం కూడా లభిస్తుంది.
శుక్రుడు బలహీనంగా ఉంటే ఇలా చేయండి:
చాలామంది జాతకాల్లో శుక్రుడు బలహీనంగా ఉంటాడు అయితే దీనికి కారణంగా జీవితంలో అనేక దుష్ప్రభావాలు ఎదురవుతూ ఉంటాయి. మీరు కూడా ఇలాంటి సమస్యలతో బాధపడుతుంటే తప్పకుండా జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచించిన కొన్ని రెమెడీస్ ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. శుక్రుడు మీ జాతకంలో బలహీనంగా ఉంటే పాలు పెరుగు నెయ్యితో తయారుచేసిన ఆహారాలు మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా తెలుపు రంగుతో కూడిన వస్తువులను దానం చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. శుక్రుడు జాతకంలో బలహీన స్థానంలో ఉంటే తెలుపు రంగు వస్తువులు, బియ్యం, పంచదార మొదలైన వస్తువులను స్త్రీలకు దానం చేయాలి.
Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి