Mangal Gochar 2023: జనవరిలో వృషభంలోకి మంగళ దేవుడు.. ఎవరికి నష్టం, ఎవరికి లాభం?
Mars Transit 2023: త్వరలో వృషభ రాశిలోకి అంగారకుడు ప్రవేశించనున్నాడు. దీని సంచారం ఏ రాశివారికి అనుకూలమో మరియు ప్రతికూలమో తెలుసుకుందాం.
Mars Transit 2023: ఆస్ట్రాలజీలో మంగళదేవుడిని గ్రహాల కమాండర్ అంటారు. అంతేకాకుండా ఈ గ్రహాన్ని శుభగ్రహంగా భావిస్తారు. మార్స్ గ్రహం జనవరి 13, 2023న వృషభ రాశిలో (Mars Transit in Taurus 2023) సంచరించనున్నాడు. 2 నెలల అనంతరం ఆ గ్రహం మార్చి 13, 2023న మిథున రాశిలోకి వెళ్లనున్నాడు. దీని కారణంగా మేషం, మిధునం మరియు కర్కాటక రాశులవారు నష్టాలను ఎదుర్కోంటారు.ఆ అన్ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
మేషం (Aries): జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, అంగారక సంచారం మేషరాశివారికి అననుకూలంగా ఉంటుంది. వీరికి ధన నష్టంతో పాటు కుటుంబ సభ్యులతో వాగ్వాదాలు తలెత్తుతాయి. పోటీపరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు విజయవంతమయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఈ సమయంలో ఎవరితోనైనా మాట్లాడేటప్పు ఆలోచించి మాట్లాడండి.
మిథునం (Gemini): మంగళదేవుడు రాశి మార్పు వల్ల వీరు అనేక సమస్యలను ఎదుర్కోవచ్చు. కుటుంబ కలహాలు రావచ్చు. దుబారాను తగ్గించుకోండి, లేకుంటే ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోనే అవకాశం ఉంది. వైవాహిక జీవితంలో ఇబ్బందులు తలెత్తుతాయి.
కర్కాటకం (Cancer): కుజుడి రాశి మార్పు కర్కాటక రాశి వారి అదృష్టాన్ని ప్రకాశింపజేస్తుంది. మీ ఆదాయంలో రెట్టింపు పెరుగుదల ఉంటుంది. ఆఫీసులో మీకు సమయం అనుకూలంగా ఉంటుంది. సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. మీరు మీ లక్ష్యాలను ఖచ్చితంగా సాధిస్తారు.
Also Read: Rahu Gochar: 2023లో రాహు గోచారం.. ఈ రాశుల అదృష్టం మారడం ఖాయం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.