Mangal Transit 2022: శత్రు రాశి అయిన మిథునరాశిలో కుజుడి సంచారం.. ఈ రాశులవారు అప్రమత్తం..
Mangal Transit 2022: శక్తి, ధైర్యానికి కారకుడైన మార్స్ గ్రహం తన రాశిచక్రాన్ని నిన్న మార్చింది. దీంతో కొన్ని రాశులవారు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది.
Mangal Transit 2022: జ్యోతిషశాస్త్రంలో అంగారక గ్రహాన్ని గ్రహాల కమాండర్ అని పిలుస్తారు. కుజుడు ధైర్యానికి, శక్తికి కారకుడు. అంతేకాకుండా మేషం, వృశ్చికరాశికి అధిపతి కూడా. మకరరాశిలో అంగారకుడిని ఉన్నతంగా భావిస్తారు. కుజుడు ఉచ్ఛస్థితిలో ఉంటే కొన్ని రాశులవారికి శుభఫలితాలు ఇస్తాడు. అంగారకుడికి సూర్యుడు, చంద్రుడితో మంచి రిలేషన్ ఉంది. అయితే కేతువుతో శత్రుత్వం ఉంది. కుజుడు నిన్న అంటే అక్టోబరు 16, మధ్యాహ్నం 12:04 గంటలకు వృషభరాశిని విడిచిపెట్టి మిథునరాశిలోకి ప్రవేశించాడు. జెమినీలో అంగారక సంచారం కొన్ని రాశులవారిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. కాబట్టి వారు జాగ్రత్తగా ఉండాలి. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
ఈ రాశులపై అంగారకుడు చెడు ప్రభావం
మేషరాశి (Aries): మిథునరాశిలో కుజుడు సంచరించడం వల్ల ఈ రాశివారు అనేక సమస్యలు ఎదుర్కోవలసి రావచ్చు. ఈ సమయంలో ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. వివాదాల జోలికి పోకుండా ఉంటే మంచిది.
వృషభం (Taurus): ఈ రాశివారికి అంగారక సంచారం కలిసిరాదు. వీరు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోంటారు. ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. కుటుంబంలో కలహాలు వచ్చే అవకాశం ఉంది.
మిథునం (Gemini): ఈ సమయంలో మీరు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. ఇల్లు-ఆస్తి కొనాలని ఆలోచిస్తున్నట్లయితే..ఇది సరైన సమయం కాదు. మీరు వ్యక్తిగత సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు.
కర్కాటక రాశి (Cancer): కర్కాటక రాశి వారికి ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. దీంతో వీరు ఆర్థికంగా కష్టాలను ఎదుర్కోంటారు. ఆరోగ్యం చెడే అవకాశం ఉంది.
మీనం (Pisces): కుజ సంచారం ఈ రాశివారికి అంతగా కలిసిరాదు. ఈ సమయం స్థిరాస్తి పెట్టుబడులకు అనుకూలం కాదు. మీరు ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది.
Also Read: Saturn Transit 2023: వచ్చే ఏడాది జనవరిలో కుంభరాశిలోకి శనిదేవుడు.. ఈ రాశులవారిపై సడే సతి స్టార్ట్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook