Mars Transit 2022: ప్రస్తుతంఇండియాలో శ్రావణ మాసం మొదలైంది. దీని కారణంగా చాలా రాశుల్లో మార్పులు వచ్చే అవకాశాలున్నాయి. ఈ నెల 10న అంగారక గ్రహం వృషభ రాశిలోకి ప్రవేశించనుంది. అయితే బుధుడు, సూర్యుడు, శుక్రుడు తర్వాత కుజుడు కూడా రాశి మారే అవకాశాలున్నాయి. ఇలా మార్పులు సంభవించడం వల్ల పలు రాశుల వారికి లాభాలు, మరి కొన్ని రాశుల వారికి నష్టాలు వాటిల్లే అవకాశాలు కూడా ఉన్నాయని శాస్త్రం పేర్కొంది. అంతేకాకుండా ఆగష్టు 10న అంగారక గ్రహం సంచారం చేయడం విశేషం. అయితే దీని కారణంగా కొన్ని రాశుల వారికి చెడు ప్రభావం తప్పవని శాస్త్రం చెబుతోంది. అంగారకుడు ఏ రాశులపై శుభ ప్రభావం చూపుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వృషభం(Taurus):
వృషభ రాశిలో అంగారక గ్రహం సంచరించడం వల్ల అయితే ఈ రాశి వారి అదృష్టం మారబొతోంది. అయితే ఈ రాశి వారు ఇంతవరకు వేరే వారిపై గొడవ పడి ఉంటే.. శత్రువులపై విజయం సాధిస్తారని శాస్త్రం తెలుపుతోంది. ముఖ్యంగా ఏవైనా పాత వివాదాలుంటే అవి తొలగిపోయే అవకాశాలు కూడా ఉన్నారు. బిజినెస్‌ రంగం వారు పెట్టుబడులు పెట్టేందుకు మంచి సమయమని శాస్త్రం చెబుతోంది.  అంతేకాకుండా కొందరు ఉద్యోగస్తులకు ప్రమోషన్‌ లభించే అవకాశాలు కూడా ఉన్నాయి.


కర్కాటక రాశి(Cancer Sign):
కర్కాటక రాశి వారికి కూడా ఈ గ్రహ సంచారం ప్రభావం పడే అవకాశాలున్నాయని జోతిష్య శాస్త్రం పేర్కొంది. అయితే ఈ రాశి వారికి మంచి శుభ పరిణామలే ఎదురయ్యే అవకాశాలున్నాయి. ముఖ్యంగా ఉద్యోగం కోసం చూసే వారు త్వరలోనే వీరు విజయం సాధిస్తారని శాస్త్రం పేర్కొంది. అంతేకాకుండా ఈ రాశి వారికి ఆర్థిక పరమైన సమస్యలు దూరమయ్యే అవకాశాలున్నాయి.



సింహ రాశి (Leo):
గ్రహ సంచారం వల్ల సింహ రాశి వారికి దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. అంతేకాకుండా  కుటుంబంలో ఆనంద పరిణామాలు ఎదురవుతాయి. ఆర్థికంగా పురోగతి  చెంది.. వ్యాపారాలు కూడా లాభపడతాయి.


ధనుస్సు రాశి(Sagittarius):


ఈ మార్పు వల్ల ధనుస్సు రాశి వారికి మంచి పరిణామాలు, ఇతర సమస్యలు దూరమవుతాయని శాస్త్రం పేర్కొంది. వీరు ఉద్యోగపరంగా ప్రయత్నింస్తే.. మంచి విజయం సాధిస్తారు. అంతేకాకుండా ఆఫీసు, పరిశ్రమల్లో మంచి పేరు సంపాదిస్తారు.


కుంభ రాశి(Aquarius):


అంగారహక గ్రహం ప్రవేశం ద్వారా కుంభ రాశి వారికి కూడా మంచి పరిణామాలే ఎదురయ్యే అవకాశాలున్నాయి. దంపతుల మధ్య తగాదాలుంటే అన్ని తీరిపోయే అవకాశాలు కూడా ఉంటాయని శాస్త్రం చెబుతోంది. ముఖ్యంగా ఇల్లు కొనాలనుకునే వారి కోరికలు తీరుతుంది.


(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ ఊహలు, సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని నిర్ధారించలేదు.)


Also Read: MP Gorantla Madhav: వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ రాసలీలలు.. సోషల్ మీడియాలో వీడియో వైరల్


Also Read: ప్రభాస్, కీర్తి సురేష్, దేవిశ్రీల ‘హర్ ఘర్ తిరంగా’ సాంగ్.. చూశారా!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook