Mangal Gochar 2023: ప్రతి గ్రహ సంచారం మన జీవితంపై ఒక ముఖ్యమైన ప్రభావాన్ని చూపుతుంది. ఈ నెల రెండో వారంలో కుజుడు మిథునరాశిలో సంచరించాడు. మే 10వ తేదీ వరకు అదే రాశిలో ఉంటాడు. శక్తి, ధైర్యానికి కారకుడైన కుజుడు రాశి మార్పు ప్రజలందరిపై పెను ప్రభావాన్ని చూపుతుంది. మేషం మరియు వృశ్చిక రాశులకు అధిపతిగా అంగారకుడిని భావిస్తారు. ఆస్ట్రాలజీలో మార్స్ ను గ్రహాల కమాండర్ అని పిలుస్తారు. కుజుడు సంచారం వల్ల నాలుగు రాశులవారు ప్రతికూల ప్రభావాలను ఎదుర్కోనున్నారు. ఆ అన్ లక్కీ  రాశులేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మంగళ గోచారం ఈ రాశులకు నష్టం


కర్కాటక రాశి
కర్కాటక రాశి యెుక్క పన్నెండవ ఇంట్లో  కుజుడు సంచారం ఏర్పడుతుంది. దీంతో ఈ సమయం మీకు చాలా కఠినంగా ఉంటుంది. మీ కెరీర్ లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటాయి. మీకు ఇష్టం లేకపోయినా ట్రాన్సఫర్ అయ్యే  అవకాశం ఉంది. 


వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి కుజుడు ఎనిమిదవ ఇంట్లో సంచరిస్తాడు. ఇది మీ ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది. మీరు ఈ సమయంలో ఆలోచించి మాట్లాడటం మంచిది.  మీకు కాలం అస్సలు కలిసిరాదు. 


మిధునరాశి
కుజుడు సంచారం ధనుస్సు రాశి యెుక్క ఏడవ ఇంట్లో జరుగుతుంది. మీరు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది. ఉద్యోగ, వ్యాపారాల్లో నష్టాలు వస్తాయి. మీరు ఏకాగ్రతతో పనిచేస్తే మీరు ప్రతికూల ప్రభావాలను నివారించవచ్చు. 


కుంభ రాశి
అంగారకుడి సంచారం కుంభరాశి యెుక్క ఐదవ ఇంట్లో జరుగుతుంది. ఈ సమయంలో మీకు సంతానం కలగదు. మీరు కెరీర్ లో అనేక సమస్యలను ఎదుర్కోంటారు. అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది. వ్యాపారస్తులు అనవసర ప్రయాణాలు చేయడం మానుకోండి.


Also Read: Guru Rashi Change 2023: ఏప్రిల్ లో మేష రాశి ప్రవేశం చేయనున్న బృహస్పతి.. ఈ 4 రాశులకు కలిసి రానున్న కాలం..


Also Read: Ravanasura Trailer: ఆసక్తి రేకెత్తిస్తున్న రావణాసుర ట్రైలర్‌.. రవితేజ మార్క్ మాస్ ఇది  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి