COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Mangal rashi parivartan 2023: కుజుడు జులై 1వ తేదీన సింహరాశిలోకి సంచారం చేశాడు. ఆగస్టు 18 వరకు అదే రాశిలో సంచార దశలో కొనసాగుతాడని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. కుజ గ్రహాన్ని గ్రహాలకు అధిపతిగా జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొన్నారు. అందుకే ఈ గ్రహాన్ని ధైర్యానికి, శౌర్యానికి సూచికగా భావిస్తారు. అయితే అంగారకుడి సంచార ప్రభావం కొన్ని రాశుల వారిపై పడుతోంది. దీని కారణంగా కొన్ని రాశుల వారు ఈనెల రెండవ వారం నుంచి ఊహించని లాభాలు పొందుతారని జ్యోతిష్య శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఏయే రాశుల వారు ఎలాంటి ప్రయోజనాలు లాభాలు పొందుతారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.


ఈ రాశులవారికి లాభాలే లాభాలు:
మేష రాశి:

ఈ రాశివారికి 5వ స్థానంలో కుజుడు సంచారం చేశాడు. ఇది జ్యోతిష్య శాస్త్రంలో ప్రత్యేక స్థానం..కాబట్టి ఈ రాశివారు కోరుకున్న కోరికలు నెరవేరుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారికి ఈ సంచారం కారణంగా మంచి ఫలితాలు పొందుతారు. ముఖ్యంగా వ్యాపారాలు చేసేవారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. వీరు భారీ ఆర్థిక ప్రయోజనాలు పొంది కొత్త ఆస్తులను కొనుగోలు చేసే ఛాన్స్‌ కూడా ఉందని నిపుణులు సూచిస్తున్నారు.


సింహ రాశి:
కుజుడు జూలై 1వ తేదినా సింహ రాశిలోకే సంచారం చేశాడు. దీంతో ఈ రాశివారికి విశేష ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. వీరు లాభాలు పొందేందుకు ఎక్కువ సమాయాన్ని కేటాయిస్తారు. అంతేకాకుండా కష్టపడి పని చేసేవారు భారీగా లాభాలు పొందే అవకాశాలు కూడా ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ రాశివారు కొన్ని విషయాల పట్ల జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. వైవాహిక జీవితం అనుభవిస్తున్నవారికి ఒత్తిడి కారణంగా అనారోగ్య సమస్యలు రావచ్చని నిపుణులు భావిస్తున్నారు.


Also Read: Scary Videos: భయానక వీడియోలు.. భారీ వర్షానికి అతలాకుతలం అవుతున్న హిమాచల్ ప్రదేశ్



మిథునరాశి:
మిథున రాశి వారికి కుజుడు సంచారంతో ధైర్యం పెరిగి అనుకున్న పనుల్లో మంచి ఫలితాలు పొందుతారు. రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టేవారికి చాలా లాభదాయకంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. వీరు ఈ క్రమంలో ఎలాంటి పనులు చేసిన సులభంగా విజయాలు సాధిస్తారు. మీ సహా ఉద్యోగులతో మీరు మంచి ప్రయోజనాలు పొందే ఛాన్స్‌ కూడా ఉంది. అంతేకాకుండా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఈ సంచారం క్రమంలో కష్టపడి పని చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. 



కర్కాటక రాశి:
కుజుడి సంచారం కర్కాటక రాశివారికి కూడా చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణలు తెలుపుతున్నారు. కుజ గ్రహం ఈ రాశి ఐశ్వర్య గృహంగా పిలబడే రెండవ స్థానంలో సంచారం చేశాడు. దీని కారణంగా ఈ రాశివారికి చాలా రకాల లాభాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. వీరు స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టడం వల్ల ఊహించని లాభాలు పొందే అవకాశాలున్నాయి. అంతేకాకుండా వ్యాపారాలు చేసేవారికి కూడా అనుకున్న లాభాలు కలుగుతాయిని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. 


Also Read: Scary Videos: భయానక వీడియోలు.. భారీ వర్షానికి అతలాకుతలం అవుతున్న హిమాచల్ ప్రదేశ్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook