Mangal Gochar 2022: కుజుడు రాశి మార్పు.. ఇక ఈ 3 రాశులవారికి అన్నీ మంచి రోజులే..
Mangal Gochar 2022: మరో ఆరు రోజుల్లో అంగారకుడు మిథునరాశిలో సంచరించనుంది. దీంతో మూడు రాశులవారు అపారమైన ప్రయోజనానాలను పొందనున్నారు.
Mangal Gochar 2022: ప్రతి గ్రహం నిర్దిష్ట సమయం తర్వాత రాశిచక్రాన్ని మారుస్తుంది. అక్టోబరు 16న ధైర్యానికి, బలానికి, భూమికి, వివాహానికి కారకుడైన కుజుడు మిథునరాశిలోకి (Mars transit in Gemini 2022) ప్రవేశించబోతున్నాడు. దీని ప్రభావం మెుత్తం 12 రాశులను ప్రభావితం చేస్తుంది. ఇది మంచైనా లేదా చెడైనా కావచ్చు. కుజుడు రాశి మార్పు మూడు రాశులవారికి శుభప్రదంగా ఉంటుంది. దీంతో ఈ రాశులవారికి సంపద, వివాహం, వృత్తి విషయాలలో శుభ ఫలితాలను పొందుతారు.
మేషం (Aries): కుజుడు రాశిచక్రంలో మార్పులు మేషరాశి జీవితంలో అనేక మార్పులను తెస్తుంది. కొత్త జాబ్ ఆఫర్ రావచ్చు. ఉద్యోగులు ప్రమోషన్ పొందుతారు. వీరి జీతం కూడా పెరిగే అవకాశం ఉంది. వ్యాపారులు భారీగా లాభపడతారు.
సింహరాశి (Leo): అంగారకుడి సంచారం సింహరాశి వారికి చాలా ప్రయోజనాలను ఇస్తుంది. ఈ వ్యక్తుల ఆదాయం పెరుగుతుంది. ధనం లాభదాయకంగా ఉంటుంది. వ్యాపారంలో అధిక లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. పనితీరు మెరుగుపడుతుంది. మీ పనికి ప్రశంసలు దక్కుతాయి. స్టాక్ మార్కెట్, లాటరీల్లో పెట్టుబడి పెట్టేవారు లాభపడతారు. కోర్టు కేసులు పరిష్కారమవుతాయి.
వృశ్చికం (Scorpio): ఈ రాశి వారికి కుజుడు సంచారం మేలు చేస్తుంది. పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. వ్యాపారానికి సంబంధించిన ప్రయాణాలు కలిసి వస్తాయి. పోటీపరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు విజయం సాధిస్తారు. విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం ఉంది.
Also Read: 'పంచ మహాపురుష రాజయోగం' చేయబోతున్న గురుడు.. ఈ 3 రాశుల వారికి డబ్బే డబ్బు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook