Mangal Gochar 2022: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, అంతరిక్షంలో గ్రహాల కదలికలు, వాటి స్థానాల మార్పు మెుత్తం 12  రాశులవారిని ప్రభావితం చేస్తుంది. ఇది కొన్ని రాశులవారికి అనుకూలంగానూ, మరికొన్ని  రాశులవారికి ప్రతికూలంగాను ఉంటుంది. అక్టోబరు నెలలో ప్రధానమైన గ్రహాలన్నీ తమ రాశులను మారుస్తాయి. అందులో ఒకటి అంగారకుడి స్థానం మార్పు. వచ్చే నెల 30న కుజుడు మిథున రాశిలోకి (Mars Transit in Gemini 2022) ప్రవేశించనున్నాడు. జెమినిలో అంగారక సంచారం కొన్ని రాశులవారికి సమస్యలను సృష్టించనుంది. ఆ దురదృష్ట రాశులేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేషరాశి (Aries): అక్టోబర్ 30న కుజుడు మిథునరాశిలో సంచరించనున్నాడు. దీంతో ఈ రాశివారిని అనేక సమస్యలను చుట్టిముడతాయి. ఆర్థికంగా నష్టపోతారు. ఒత్తిడికి గురవుతారు. ఈ సమయంలో ఈ రాశివారు వివాదాలకు దూరంగా ఉంటే మంచిది.  


వృషభం (Taurus): వృషభ రాశి వారికి అంగారక సంచారం కలిసిరాదు.. కుజుడు రాశి మార్పు వల్ల ఈరాశివారు ఆర్థికంగా సమస్యలు ఎదుర్కోవచ్చు. ఖర్చులు భారీగా పెరిగే అవకాశం ఉంది. కుటుంబంలో కలహాలు వస్తాయి. 


మిధునరాశి (Gemini): మార్స్ ట్రాన్సిట్ వల్ల ఈ రాశివారు అనారోగ్యానికి గురవుతారు. వ్యక్తిగతంగా కూడా సమస్యలను ఎదుర్కోంటారు. అందుకే ఈ సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండటం అవసరం.  


కర్కాటకం (Cancer): కర్కాటక రాశి వారికి అంగారక సంచారం శ్రేయస్కరం కాదు. ఈ వ్యక్తులు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది. అదేవిధంగా ఖర్చులు భారీగా పెరిగే అవకాశం ఉంది. ఈ సమయంలో మీ ఆరోగ్యం కూడా అంతగా సహకరించదు.


మీనరాశి (Pisces): ఈ సమయంలో ఆస్తులు వంటివి కొనుగోలు చేయకండి. ఎందుకంటే ఇది మీకు కలిసిరాదు. అంతేకాకుండా ఈ టైంలో పెట్టుబడులు కూడా పెట్టకండి, నష్టాలను మిగిల్చే అవకాశం ఉంది. ఆర్థికంగా, మానసికంగా కూడా ఇబ్బందులను ఎదుర్కోవల్సి ఉంటుంది. 


Also Read: Shukra Gochar 2022: కన్యారాశిలో శుక్ర సంచారం... నవరాత్రుల్లో ఈ రాశుల వారికి స్పెషల్ బెనిఫిట్స్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.      


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu       


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook