Mangal Margi 2023: సౌర వ్యవస్థలో ఉన్న గ్రహాలు ఎప్పటికప్పుడు మార్పులు జరుగుతూ ఉంటాయి. ఈ కదలికలను జ్యోతిష్య శాస్త్రంలో వక్రీ, మార్గి అని అంటారు. ఒక గ్రహం తిరోగమనం చెందినప్పుడు రెట్రోగ్రేడ్ అని అంటారు. అదే గ్రహం సంచారం చేస్తే మార్గి అని పిలుస్తారు. అయితే ఈ రెండు దశలు రాశి చక్రాలపై వ్వక్తుల జీవితాలపై ప్రభావం చూపుతాయి.  గ్రహాలు ప్రత్యక్షంగా తిరోగమనం చెందితే వ్యక్తుల జీవితాలపై చాలా ప్రభావం పడే అవకాశాలున్నాయి. అయితే ఈ నెలలో వచ్చే నెలలో చాలా రకాల గ్రహాలు సంచారం చేయబోతున్నాయి. దీంతో పలు రాశువారి జీవితంలో వివిధ రకాల మార్పులు జరిగే ఛాన్స్‌ ఉంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వ్యక్తుల జీవితాల్లో కుజుడు బలంగా ఉంటే చెడు పరిణామాలు కలిగే అవకాశాలున్నాయి.  కుజుడు బలవంతంగా ఉంటే శుభం, ఫలప్రదం.  కొత్త సంవత్సరంలో 2023 జనవరి 13న కుజుడు వృషభరాశిలో సంచారం చేయనున్నాడు. దీంతో పలు రాశువారికి చాలా రకాల ప్రయోజనాలు కలిగే అవకాశాలున్నాయి.


ఈ రాశువారిపై ఎఫెక్ట్‌:
కర్కాటక రాశి:

ఈ సంచారం వల్ల కర్కాటక రాశి వారికి వ్యాపార, ఉద్యోగాలలో ఊహించని శుభ ఫలితాలు కలుగుతాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఈ రాశి వారికి ఉద్యోగ, వ్యాపారస్తులకు పురోభివృద్ధికి కొత్త అవకాశాలు లభిస్తాయి. అంతేకాకుండా సమాజంలో గౌరవం లభిస్తుంది. కుటుంబ సభ్యులందరితో సంబంధాలు మెరుగుపడతాయి.


మకరరాశి:
కుజుడు మార్గం వల్ల మకర రాశి వారికి వ్యాపారంలో అధిక లాభం చేకూరుతాయి. అంతేకాకుండా కార్యాలయంలో పురోగతి లభిస్తుంది. ముఖ్యంగా ఈ సమయం విద్యార్థులకు మంచి సమయంగా భావించవచ్చు. విద్యార్థులకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. వీరు చదువులో విజయం సాధించే అవకాశాలున్నాయి.


కుంభ రాశి:
కుజుడు అనుగ్రహంతో కుంభ రాశి వారికి భూమి, ఆస్తి, వాహన వ్యవహారాల్లో విపరీతమైన లాభాలు కలుగుతాయి.  కుంభ రాశి వారు వ్యాపారాల్లో విజయాలు సాధిస్తారు. వృత్తి జీవితంలో కొత్త గుర్తింపు పొందుతారు. విద్యార్థులు చదువుల్లో విజయ సాధించి మంచి ఫలితాలు పొందుతారు.


మీనరాశి:
ఈ సంచారం వల్ల మీనరాశి వారికి కూడా చాలా శుభప్రదంగా ఉంటుందని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ క్రమంలో ఈ రాశి వారికి ఉద్యోగస్తులకు ప్రమోషన్స్‌ లభించే అవకాశాలున్నాయి. అంతేకాకుండా వైవాహిక జీవితంలో సంతోషాలు కూడా కలుగుతాయి. భార్యాభర్తల మధ్య మంచి సంబంధాలు ఏర్పడతాయి.


Also Read: Nanda Kumar Bail: నంద కుమార్‌కి బెయిల్.. అంతలోనే పిటి వారంట్ కావాలన్న పోలీసులు


Also Read: Harish Rao: ప్రధాని మోదీ ఇచ్చిన వాగ్ధానం ఏమైందన్న మంత్రి హరీశ్ రావు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook