Mars Margi In Taurus 2023:  జ్యోతిషశాస్త్రం ప్రకారం, గ్రహాలు ఎప్పటికప్పుడు తమ గమనాన్ని మార్చుకుంటూ ఉంటాయి. గ్రహాల కదలికలో మార్పు ప్రతి ఒక్కరి జీవితంపై పెను ప్రభావాన్ని చూపుతుంది. ప్రస్తుతం కుజుడు వృషభరాశిలో సంచరిస్తున్నాడు. అయితే వచ్చే ఏడాది ప్రారంభంలో అంటే జనవరి 13న అంగారకుడు వృషభరాశిలో మార్గంలోకి (Mangal Margi 2022) రానున్నాడు. దీని ప్రభావం మూడు రాశులవారికి అనుకూలంగా ఉండనుంది. ఆ రాశుల ఏవో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేషం (Aries): వృషభ రాశిలో కుజుడు మార్గి ఉండటం వల్ల మీకు ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది. ఎందుకంటే మీ సంచార జాతకంలో కుజుడు రెండవ ఇంట్లో ఉండబోతున్నాడు. దీంతో మీరు ఆకస్మిక ధనాన్ని పొందుతారు. మీరు డబ్బును ఎవరికైనా అప్పుగా ఇచ్చినట్లయితే అది తిరిగి వస్తుంది. పాత పెట్టుబడి నుంచి మీకు ప్రయోజనం లభిస్తుంది. నిరుద్యోగులకు జాబ్ లభిస్తుంది. విదేశాలతో వ్యాపారం చేసే వారు భారీగా సంపదను ఆర్జిస్తారు. మార్కెటింగ్, మీడియా, ఉపాధ్యాయ రంగానికి చెందిన వ్యక్తులకు ఈ సమయం అద్భుతంగా ఉంటుంది. 


వృశ్చికం (Scorpio): వృషభ రాశిలో అంగారకుడి సంచారం మీకు అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే కుజుడు మీ రాశి నుండి ఏడవ ఇంటిలో సంచరించబోతున్నాడు. పార్టనర్ షిప్ తో చేసే పనుల్లో విజయం సాధిస్తారు. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. టూర్ కు వెళ్లే అవకాశం ఉంది. పెళ్లికానీ యువతీయువకులకు వివాహ ప్రతిపాదన వచ్చే అవకాసం ఉంది. ఈ రాశికి అంగారకుడు అధిపతి. అందుకే కుజుడి సంచారం ఈ రాశివారికి శుభప్రదంగా ఉంటుంది. 


కుంభం (Aquarius): అంగారకుడు మార్గంలో ఉండటం వల్ల మీకు అపారమైన ప్రయోజనాలు లభిస్తాయి. ఎందుకంటే కుజుడు మీ రాశి నుండి నాల్గవ ఇంట్లో సంచరించబోతున్నాడు. ఏదైనా వాహనం లేదా ఆస్తిని కొనుగోలు  చేసే అవకాశం ఉంది. అలాగే ఈ సమయంలో ప్రాపర్టీలో ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలు సాధిస్తారు. మీరు కొత్త జాబ్ పొందే అవకాశం ఉంది. ఆఫీసులో మీ సహచరుల మద్దతు లభించే అవకాశం ఉంది. 


Also Read: Guru Margi 2022: మీనంలో నడవనున్న గురుడు.. ఈ 5 రాశులవారిని వరించిన అదృష్టం..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook