Nav Pancham Yog 2023: శని-కుజుడు కలయికతో ఏర్పడనున్న `నవపంచం యోగం`.. ఈ రాశులకు కలిసిరానున్న కాలం
Mangal Gochar 2023: మార్చి 13న కుజుడు మిథునరాశిలో సంచరించబోతున్నాడు. దీని కారణంగా శనితో కలిసి అంగారకుడు నవ పంచమ యోగం ఏర్పరుస్తున్నాడు. దీంతో కొన్ని రాశుల వారికి అదృష్టం ప్రకాశించనుంది.
Mars Transit 2023: వేద జ్యోతిషశాస్త్రంలో అంగారకుడిని ధైర్యం, శౌర్యం మరియు వివాహానికి కారకుడిగా భావిస్తారు. జాతకంలో కుజుడు బలంగా ఉంటే వారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తవు. మార్చి 13న కుజుడు మిథునరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. దీంతో శని-కుజుడు కలయిక ఏర్పడబోతుంది. వీరిద్దరి సంయోగం వల్ల నవపంచం యోగం ఏర్పడుతుంది. దీంతో కొన్ని రాశులవారి అదృష్టం ప్రకాశించనుంది ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
నవపంచం యోగం ఈ రాశులకు వరం
మేషరాశి
అంగారకుడి సంచారం మేష రాశి వారికి సంతోషాన్ని కలిగిస్తుంది. వీరు భారీ లాభాలను సాధిస్తారు. విద్యార్థులు పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తారు. పోటీపరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు విజయం సాధిస్తారు. మీకు ఫ్యామిలీ సపోర్టు లభిస్తుంది. మీరు వృత్తిలో పురోగతి సాధిస్తారు.
సింహరాశి
మిథునరాశిలో అంగారకుడి ప్రవేశం సింహరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. దీంతో మీరు ప్రత్యేక ప్రయోజనాలు పొందుతారు. కొత్త పెట్టుబడులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా మీరు కెరీర్ లో విజయం సాధిస్తారు.
కన్య రాశి
కుజ సంచారం కన్యా రాశి వారికి మేలు చేస్తుంది. మీ పనికి ప్రశంసలు దక్కుతాయి. వ్యాపారాన్ని విస్తరిస్తారు. బిజినెస్ చేసేవారు కొత్త ఆర్డర్ లను స్వీకరించే అవకాశం ఉంది. మీలో ధైర్యం పెరుగుతుంది. మెుత్తానికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.
మకరరాశి
మకర రాశి వారి అదృష్టం ప్రకాశిస్తుంది. మీరు ప్రతి పనిలో విజయం సాధిస్తారు. అనుకున్న ఉద్యోగాన్ని సాధిస్తారు. ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి. మకరరాశి వారికి ఈ సమయం సూపర్ గా ఉంటుంది.
Also Read: Mangal Surya Gochar: రాశిని మార్చబోతున్న అంగారకుడు-సూర్యుడు.. ఈ రాశులకు తిరుగులేదు ఇక..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook