Mangal Vakri 2022: వృషభ రాశిలోకి తిరోగమన కుజుడు... ఈ రాశుల వారు జాగ్రత్త..
Mangal Vakri 2022: వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం, కుజుడు తిరోగమన స్థితిలో వృషభరాశిలో సంచరించబోతున్నాడు. అంగారక సంచారం వల్ల మూడు రాశులవారు కొన్ని సమస్యలు ఎదుర్కోనున్నారు.
Mangal Vakri In November 2022: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఒక గ్రహం సంచరించనప్పుడు లేదా తిరోగమనంలో ఉన్నప్పుడు.. దాని ప్రత్యక్ష ప్రభావం ప్రజలందరిపై కనిపిస్తుంది. నవంబరు 13న తిరోగమన కుజుడు వృషభరాశిలో (Mangal Vakri In November 2022) సంచరించనున్నాడు. ఈ సమయంలో మూడు రాశులవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వీరు భారీగా డబ్బు నష్టపోయే అవకాసం ఉంది. ఆ అన్ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
మేషం (Aries): కుజుడు రాశి మార్పు మేష రాశి వారికి అశుభం. ఎందుకంటే మీ జాతకం యెుక్క రెండవ స్థానంలో కుజుడు సంచారం జరగబోతోంది. ఇది ప్రసంగం మరియు డబ్బు యొక్క ప్రదేశంగా భావిస్తారు. అందువల్ల మీరు ఈ సమయంలో భారీగా డబ్బును నష్టపోవచ్చు. ఆఫీసులో మీ సహచరుల సపోర్టు లభిస్తుంది. ఈ సమయంలో మీరు లావాదేవీలు, పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండటం అవసరం.
మిథునం (Gemini): అంగారకుడి సంచారం మీకు హానికరం. ఎందుకంటే మీ రాశి నుండి 12వ ఇంట్లో కుజుడు సంచరించబోతున్నాడు. దీంతో మీ ఖర్చులు భారీగా పెరుగుతాయి. మీరు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోనే అవకాశం ఉంది. ప్రయాణాలు మీకు కలిసిరావు. మీరు ఆరోగ్య సమస్యలను ఎదుర్కోనే అవకాశం ఉంది. మీ జీవిత భాగస్వామితో విభేదాలు రావచ్చు.
తుల (Libra): అంగారకుడి సంచారం మీకు బాధాకరంగా ఉంటుంది. ఎందుకంటే కుజుడు మీ రాశి నుండి ఎనిమిదవ ఇంట్లో ఉండబోతున్నాడు. దీంతో తులరాశి వారు విజయం సాధిస్తారు.ఈ సమయంలో మీరు మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మీరు పని ప్రదేశంలో అజాగ్రత్తగా ఉండకూడదు. లేదంటే ఇబ్బంది రావచ్చు.
Also Read: Gajkesri Rajyog: మీనరాశిలో గజకేసరి యోగం... ఈ 3 రాశులవారిని వరించనున్న అదృష్టం...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook