Planet Changes 2023: ఈ నెలలో 4 గ్రహాల గమనంలో పెను మార్పు.. వీటిపై బిగ్ ఎఫెక్ట్..
Grah Gochar 2023 : ఆస్ట్రాలజీ ప్రకారం, మార్చిలో బుధుడు, శుక్రుడు, సూర్యుడు మరియు అంగారకుడు తమ రాశులను ఛేంజ్ చేయనున్నాయి. ఈ గ్రహాల రాశి మార్పు చాలా మంది రాశులను ప్రభావితం చేయనుంది.
March Grah Gochar 2023 : గ్రహాల సంచారపరంగా మార్చి నెల చాలా ముఖ్యమైనది. ఈ నెలలో కొన్ని పెద్ద ఫ్లానెట్స్ తమ రాశులను ఛేంజ్ చేయనున్నాయి. సూర్యుడు, బుధుడు, శుక్రుడు మరియు అంగారుకుడు తమ తమ రాశులను ఛేంజ్ చేయనున్నాయి. ఈ గ్రహాల రాశి మార్పు వల్ల కొందరికి అదృష్టం పట్టనుంది. అంతేకాకుండా వీరికి భారీ మెుత్తంలో డబ్బు, ఉద్యోగంలో ప్రమోషన్ లభించే అవకాశం ఉంది.
మేషరాశిలో శుక్రుడి సంచారం
ఐశ్వర్యాన్ని ఇచ్చే శుక్రుడు మార్చి 12న మేషరాశిలోకి ప్రవేశించనున్నాడు. ఇతడు ఆనందం, అందం, సంపద, లవ్ మరియు రొమాన్స్ కు కారకుడు. శుక్రుడి యెుక్క రాశి మార్పు చాలా రాశులను ప్రభావితం చేస్తుంది.
మిథునరాశిలో కుజుడి సంచారం
శుక్రుడి రాశి మార్పు జరిగిన తర్వాత రోజు అంగారకుడు సంచారం జరగనుంది. మార్చి 13న కుజుడు మిథునరాశిలోకి ఎంటర్ అవ్వనున్నాడు. ఈ గ్రహ సంచారం కొందరికి శుభప్రదంగానూ, మరికొందరికి అశుభకరంగానూ ఉంటుంది.
మీనరాశిలో బుధుడి గోచారం
గ్రహాల ప్రిన్స్ మార్చి 14న మీనరాశిలోకి ప్రవేశించనున్నాడు. బుధుడి యెుక్క రాశి మార్పు కొన్ని రాశులవారికి కలిసి రానుంది. వీరు అపారమైన ధనాన్ని పొందనున్నారు.
మీనంలో సూర్యుడి సంచారం
బుధుడి సంచారం తర్వాత రోజు అంటే మార్చి 15న సూర్యుడు కుంభరాశి నుంచి మీనరాశిలోకి ఎంటర్ అవ్వనున్నాడు. మెర్య్కూరీ గోచారం వల్ల కొందరు ప్రత్యేక ప్రయోజనాలను పొందనున్నారు.
Also Read: Surya Gochar 2023: మార్చి 15 నుండి ఈ రాశుల దశ తిరగనుంది.. ఇందులో మీ రాశి ఉందా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook