March Month Rasi Phalalu 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, మార్చి నెల 2024 చాలా శుభప్రదంగా ఉండబోతోంది. ఎందుకంటే ఈ నెలలో అనేక గ్రహాలు రాశి సంచారం చేయబోతున్నాయి. దీంతో పాటు కొన్ని నక్షత్ర సంచారాలు జరిగే ఛాన్స్‌ కూడా ఉందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అలాగే ఈ నెలలో ఏర్పడే ప్రత్యేక యోగాలు కూడా ఏర్పడతాయి. దీంతో కొన్ని రాశులవారికి ఈ నెల చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మార్చి నెల ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మార్చి నెల 2024 రాశి ఫలాలు
మేషం (Aries):

మార్చి నెల మేష రాశివారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ సమయంలో వీరు కొన్ని  శుభకార్యక్రమాల్లో పాల్గొనే ఛాన్స్‌ కూడా ఉంది.  ఆర్థికంగా లాభాలు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకు పదోన్నతులు, వ్యాపారస్తులకు లాభాలు అవకాశం ఉంది. దీంతో పాటు వీరు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.


వృషభం (Taurus):
ఈ నెల వృషభ (Taurus) రాశివారికి ఎంతో లాభదాయకంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ నెల మీకు కొంచెం కష్టతరంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించడం చాలా మంచిది. దీంతో పాటు ఈ సమయంలో కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యల బారిన పడే ఛాన్స్‌ కూడా ఉంది. 


మిథునం (Gemini):
మార్చి నెల మిథున రాశి వారికి కూడా కొంత ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సమయంలో వీరికి మంచి ఫలితాలు కలుగుతాయి. ఉద్యోగంలో మంచి అవకాశాలు లభిస్తాయి. దీంతో పాటు వ్యాపారాల్లో కూడా ఊహించని లాభాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. అలాగే ఉద్యోగాలు చేసేవారికి కూడా అనుకున్న ప్రమోషన్స్‌ లభిస్తాయి. దీంతో పాటు కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి. 


కర్కాటకం (Cancer):
ఈ సమయంలో కర్కాటక రాశివారికి మిశ్రమ లాభాలు కలుగుతాయి. ఈ నెల మీకు కొంచెం ఒత్తిడితో కూడుకున్నట్లు ఉండే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే తీవ్ర అనారోగ్య సమస్యల వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు కుంటుంబ సభ్యుల మధ్య గొడవలు కూడా రావచ్చని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. 


సింహ (Leo):
మార్చి నెలలో సింహ రాశి వారికి అనేక రకాల లాభాలు కలుగుతాయి. ఈ సమయంలో శుభవార్తలు వింటారు. దీంతో పాటు ఇంట్లో శుభకార్యక్రమాలు జరిగే ఛాన్స్‌ కూడా ఉందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఉద్యోగస్తులకు పదోన్నతులు, వ్యాపారస్తులకు లాభాలు లభించే అవకాశం ఉంది. అంతేకాకుండా కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. దీంతో పాటు ఆర్థికంగా కూడా చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. 


కన్య (Virgo):
కన్య రాశివారికి మార్చి నెల చాలా ఫలప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా వీరికి అనుకు ఫలితాలు లభిస్తాయి. అలాగే ఉద్యోగాలు చేసేవారికి కూడా అనుకున్న లాభాలు పొందుతారుని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. కుటుంభ సభ్యులు కూడా ఈ సమయంలో చాలా ఆనందంగా ఉంటారు. దీంతో పాటు ఈ సమయంలో కోరుకున్న కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. 


తుల (Libra):
తుల రాశివారికి ఈ నెల మీకు కొంచెం కష్టతరంగా ఉండే అవకాశం ఉందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ సమయంలో అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. కుటుంబంలో చిన్న చిన్న గొడవలు రావచ్చు. కాబట్టి వారితో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో పాటు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో పాటు అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉండడానికి జీవనశైలిని కూడా మార్చుకోవాల్సి ఉంటుంది. 


వృశ్చికం (Scorpio):
వృశ్చిక రాశివారికి ఈ మార్చి నెలల చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సమయంలో ఎలాంటి పనులు చేసిన సులభంగా విజయాలు సాధిస్తారు. అంతేకాకుండా ఆర్థికంగా అనేక మార్పులు వచ్చి, ఆదాయం కూడా రెట్టింపు అవుతుంది. దీంతో పాటు ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్‌ లభించి ఆదాయం కూడా పెరుగుతుంది. ఈ సమయంలో కుటుంబ సభ్యుల నుంచి సపోర్ట్ కూడా లభిస్తుంది. 


ధనస్సు (Sagittarius):
ధనస్సు రాశివారికి కూడా ఈ నెల శుభప్రదంగా ఉండబోతోంది. కాబట్టి ఈ సమయంలో పెట్టుబడులు పెట్టడం, కొత్త పనులు ప్రారంభించడం చాలా శుభప్రదమని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఉద్యోగాలు చేసేవారికి ఒత్తిడి కూడా తగ్గుతుంది. అంతేకాకుండా ప్రమోషన్స్‌ కూడా లభిస్తాయి. అలాగే వ్యాపారస్తులకు లాభాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. 


మకర (Capricorn):
మార్చి నెలలో మకర రాశివారికి కెరీర్‌లో కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. మీ పనిలో మీకు ఒత్తిడి ఎక్కువగా ఉండవచ్చు. అంతేకాకుండా ఆర్థికంగా చాలా మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఇతర నుంచి కూడా డబ్బులు పొందుతారు. దీంతో పాటు వ్యక్తిగత జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఉండవచ్చు. మీ కుటుంబ సభ్యులతో మీకు కొన్ని విభేదాలు రావచ్చు. ఈ నెల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. 


కుంభ (Aquarius):
కుంభ రాశి వారికి ఈ నెల మీకు చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా మీరు మీ లక్ష్యాలను చేరుకుంటారు. అంతేకాకుండా ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. అంతేకాకుండా డబ్బు సంబంధిత విషయాల్లో కూడా మార్పులు వస్తాయి. దీంతో పాటు డబ్బు విషయంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ సమయంలో ఊహించని ప్రయోజనాలు కూడా కలుగుతాయి. కొత్త ఉద్యోగం కోసం చూస్తున్నవారికి ఈ నెల శుభప్రదంగా ఉంటుంది.


మీన (Pisces):
ఈ నెల మీన రాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా కొత్త అవకాశాలు, శుభవార్తలు వచ్చే అవకాశం ఉంది. ఈ మార్చి నెలలో ఆలోచనలు స్పష్టంగా ఉండడం వల్ల మీరు సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. దీంతో పాటు మీకు కొత్త ఉద్యోగం రావచ్చు లేదా మీ ప్రస్తుత ఉద్యోగంలో పదోన్నతి పొందవచ్చు. ఈ నెల మీ వృత్తి జీవితంలో చాలా మంచి మార్పులు వస్తాయి. అంతేకాకుండా ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడతాయి.


Also Read: Weight Loss In 10 Days: ఎండా కాలంలో పింపుల్‌గా 10 రోజుల్లో బరువు తగ్గాలనుకునేవారికి నిపుణుల సూచనలు ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter