Margashira Masam 2022: హిందూ క్యాలెండర్ ప్రకారం.. సంవత్సరంలో తొమ్మిదవ నెల మార్గశీర మాసం అని అంటారు. ఈ మాసాన్ని అఘన మాసం అని కూడా అంటారు. అయితే ప్రతి నెలకు గాను ఓ ప్రత్యేకత ఉంటుంది. మార్గశీర మాసంలో శ్రీకృష్ణునికి పూజించడం ఆనవాయిగా వస్తోంది. అందుకే ఈ క్రమంలో కృష్ణుడిని తలుచుకుని పూజా కార్యక్రమలు చేస్తారు. అంతేకాకుండా ఆయనకు ఇష్టమైన నైవేద్యాన్ని సమర్పించి..మంత్రాలు పఠిస్తారు. ఇలా చేయడం వల్ల కృష్ణుడి అనుగ్రహం లభించి కోరుకున్న కోరికలు నెరవేరుతాయని శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మార్గశీర మాసంలో ఉపవాసాలు కూడా పాటిస్తారు. అయితే ఈ క్రమంలో వివాహం వంటి శుభ కార్యాలు చేస్తే మంచి ఫలితాలు పొందుతారని జోతిష్య శాస్త్రంలో పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ మాసాన్ని స్వర్ణయుగం అని కూడా అంటారని శాస్త్రంలో పేర్కొన్నారు. ఈ మాసంలో పెద్ద పండగ లేకపోయినా ఎంతో ప్రత్యేకత కలిగిన మాసంగా భావిస్తారు. ఈ మాసంలో వివాహ పంచమి, ఉత్పన ఏకాదశి, మోక్షదా ఏకాదశి, గీతా జయంతి ప్రత్యేక రోజుల్లో ఉపవాసాలు ఆచరిస్తారు. అయితే ఈ నెలలో వచ్చే పండగలు ఇతర ప్రత్యేకమైన రోజుల గురించి తెలుసుకుందాం..


2022 మార్గశీర మాసంలో పండుగలు, ఉపవాసాల తేదీలు:
9 నవంబర్ 2022 2022, బుధవారం- మార్గశీర మాసం ప్రారంభమవుతుంది.
11 నవంబర్ 2022, శుక్రవారం - సౌభాగ్య సుందరి వ్రతం
12 నవంబర్ 2022, శనివారం - గణాధిప సంక్షోభ చతుర్థి
16 నవంబర్ 2022, బుధవారం - కాల భైరవ జయంతి, వృశ్చిక సంక్రాంతి
20 నవంబర్ 2022, ఆదివారం - ఉత్తాన ఏకాదశి
21 నవంబర్ 2022, సోమవారం - సోమ ప్రదోష వ్రతం
22 నవంబర్ 2022, మంగళవారం - మార్గశీర మాస శివరాత్రి
23 నవంబర్ 2022, బుధవారం - మార్గశీర అమావాస్య
27 నవంబర్ 2022, ఆదివారం - వినాయక చతుర్థి
28 నవంబర్ 2022, సోమవారం- వివాహ పంచమి
29 నవంబర్ 2022, మంగళవారం - చంపా షష్ఠి
3 డిసెంబర్ 2022, శనివారం - మోక్షద ఏకాదశి, గీతా జయంతి
4 డిసెంబర్ 2022, ఆదివారం - వైష్ణవ మోక్షద ఏకాదశి
5 డిసెంబర్ 2022, సోమవారం- త్రయోదశి వ్రతం, సోమ ప్రదోష వ్రతం
7 డిసెంబర్ 2022, బుధవారం- అన్నపూర్ణ జయంతి, పూర్ణిమ వ్రతం, సత్య వ్రతం
8 డిసెంబర్ 2022, గురువారం - అఘన పూర్ణిమ, మార్గశీర పూర్ణిమ


Also Read: Amazon Smart tv offers: మీ ఇంటిని హోమ్ థియేటర్‌గా మార్చే స్మార్ట్‌టీవీ కేవలం 9 వేలే


Also Read: Amazon Smart tv offers: మీ ఇంటిని హోమ్ థియేటర్‌గా మార్చే స్మార్ట్‌టీవీ కేవలం 9 వేలే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook