Marriage Dates In 2023: నవంబర్‌లో పెళ్లి శుభముహూర్తాలు..సూర్యుడి సంచారంతో మధ్యలో గ్యాప్!
Pelli Subha Muhurtham 2023: చాతుర్మాసం ముగియడంతో వివాహా శుభముహూర్తాలు ప్రారంభమయ్యాయి. అంతేకాకుండా ఇదే సమయంలో విష్ణువు కూడా యోగ నిద్ర నుంచి మేల్కొంటాడు. అయితే ఈ సమయంలో విష్ణువుకి ప్రత్యేక పూజలు చేసి ఉపవాసాలు పాటించడం వల్ల పాపాలు కూడా తొలగిపోతాయి.
Pelli Subha Muhurtham 2023: హిందూ సంప్రదాయం ప్రకారం..చాతుర్మాసం ముగియడంతో మరోసారి శుభ కార్యాలు ప్రారంభం కానున్నాయి. కార్తీక మాసంలోని శుక్ల పక్షంలోని ఏకాదశి తిథిని దేవుత్తాన ఏకాదశి అంటారు. అంతేకాకుండా కొన్ని రాష్ట్రాల్లో ఉథాని ఏకాదశి అని కూడా అంటారు. చాతుర్మాసంలో విష్ణువు యోగ నిద్రలోకి వెళ్తాడు. అయితే చాలా రోజుల తర్వాత ఈ ఏకాదశి రోజున విష్ణువు యోగ నిద్ర కాలం ముగుస్తుంది. అందుకే సంప్రదాయం ప్రకారం భక్తులు దేవుత్తాన ఏకాదశి రోజు తులసి మాతకు వివాహాలు చేస్తారు. అయితే ఇదే సమయంలో వివాహా శుభ సమయాలు కూడా ప్రారంభమవుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
ఈ సంవత్సరం దేవుత్తాన ఏకాదశి నవంబర్ 23 గురువారం రోజు రాబోతోంది. అయితే ఈ ఏకాదశి రోజు పూర్వీకుల నుంచి సూర్యదేవుడితో పాటు ఇతర దేవతామూర్తులకు ఉపవాసాలు పాటించడం ఆనవాయితిగా వస్తోంది. సనాతన ధర్మంలో ఈ ఏకాదశి తేదీలకు ప్రత్యేక ప్రాముఖ్య ఉంది. ఇదే సమయంలో విష్ణువు యోగ నిద్ర మేల్కొని భక్తులకు అనుగ్రహిస్తాడు. అయితే ఇదే సమయంలో వివాహం శుభముహూర్తాలు ప్రారంభమవుతాయి.
దేవుత్తాన ఏకాదశి గురించి స్కాంద పురాణం, మహాభారతంలో కూడా వివరించారు. ఈ ఏకాదశి రోజు విష్ణువు మూర్తిని పూజించడం వల్ల జన్మ జన్మ పాపాలు కూడా తొలగిపోతాయి. అంతేకాకుండా అన్ని బాధల నుంచి విముక్తి లభిస్తుందని జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొన్నారు. ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో తులసి కళ్యాణాన్ని నిర్వహిస్తారు.
వివాహ శుభ ముహూర్తాలు:
దేవుత్తాన ఏకాదశి తర్వాత నవంబర్ 24, 27, 28, 29 తేదిలు వివాహాలు జరపడతాని చాలా ప్రత్యేకమైనవిగా జ్యోతిష్య శాస్త్ర నిపుణులు భావిస్తున్నారు. ఇక డిసెంబర్ నెల విషయానికొస్తే..3, 4, 5, 6, 7, 8, 9, 13, 14, 15 తేదీల్లో శుభ ముహూర్తాలు ఉంటాయి. కాబట్టి ఈ సమయంలో వివాహాలు, కొత్త వ్యాపారాలు ప్రారంభించడం చాలా మంచిది. డిసెంబర్ 16న సూర్యుడు ధనుస్సు రాశిలోకి సంచారం చేయబోతున్నాడు. కాబట్టి ఈ సమయంలో శుభ ముహూర్తాలు ముగుస్తాయి. ఈ సమయంలో వివాహం మొదలైన శుభకార్యాలు చేయడం నిషేధమని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు పేర్కొన్నారు. మళ్లీ మంచి రోజులు జనవరి 15 తర్వాత మాత్రమే ప్రారంభమవుతాయి. కాబట్టి అంత దాకా ఎలాంటి శుభకార్యక్రమాలు చేయకూడదని జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి