Navpancham Rajyog Benefits: గ్రహాలు ఇతర గ్రహాలతో స్నేహం చేయడం ద్వారా శుభ మరియు అశుభ యోగాలను ఏర్పరుస్తాయి. ఇటీవల అంగారకుడు కర్కాటకరాశిని వదిలి సింహరాశిలోకి ప్రవేశించాడు. కుజుడు మరియు గురు గ్రహ కలయిక వల్ల నవపంచం రాజయోగం సంభవించబోతుంది. ఈ శుభ యోగం వల్ల నాలుగు రాశులవారికి అదృష్టం పట్టనుంది. ఆ లక్కీ రాశులు ఏంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేషరాశి
నవపంచమ యోగ సమయంలో గురు గ్రహ దృష్టి అంగారకుడిపై పడుతోంది. ఈ సమయంలో మేషరాశి వారికి గౌరవం పెరుగుతుంది. మీరు కొన్ని శుభవార్తలు కూడా వింటారు. నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది. వ్యాపారులు మంచి లాభాలను పొందుతారు. మీ కెరీర్ బాగుంటుంది. ఆగిపోయిన పనులన్నీ ప్రారంభమవుతాయి. 
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి నవపంచం రాజయోగం వరమనే చెప్పాలి. దీంతో మీకు ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ఉద్యోగస్తులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మీరు ఆధ్యాత్మిక యాత్రకు వెళ్లే అవకాశం ఉంది. మీరు డబ్బు లావాదేవీలు చేయడానికి ఇదే మంచి సమయం. మీరు ఏదైనా విలువైన వస్తువును కొనుగోలు చేసే అవకాశం ఉంది. 
సింహరాశి
గురు, కుజుడు కలయికతో ఏర్పడిన నవపంచం రాజయోగం సింహ రాశి వారికి మేలు చేస్తుంది. దీంతో మీకు ప్రతి పనిలో అదృష్టం కలసి వస్తుంది. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. వ్యాపారస్తులు ఊహించని లాభాలను పొందుతారు. విద్యార్థులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. 


Also Read: Jupiter Nakshatra Transit 2023: త్వరలోనే బృహస్పతి నక్షత్రంలో మార్పు, ఈ రాశులవారికి ఊహించని లాభాలు


తులారాశి
వృత్తి మరియు వ్యాపార పరంగా నవపంచం రాజయోగం తులారాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. మీ ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. మీ లైఫ్ పార్టనర్ సపోర్టు లభిస్తుంది. మీ మనసు అందంతో నిండి పోతుంది. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. 


Also Read: Sun Transit 2023: మరో 5 రోజుల తర్వాత ఈ 3 రాశులకు అదృష్టం పట్టనుంది.. మీ రాశి ఉందా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook