Mars-Ketu Transit 2023: జ్యోతిష్యం ప్రకారం ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో నిర్దేశిత రాశిలో ప్రవేశిస్తుంటుంది. దీనినే రాశి పరివర్తనం లేదా గ్రహాల గోచారమని పిలుస్తారు. కొన్ని గ్రహాలు నెలకొసారి, కొన్ని రెండు నెలలకోసారి, మరికొన్ని ఏడాదికోసారి లేదా ఇంకా ఎక్కువ సమయం తీసుకుంటాయంటారు. ఇప్పుడు త్వరలోనే మంగళ గ్రహం తులా రాశిలో ప్రవేశిస్తూనే మంగళ కేతు యుతి ఏర్పర్చనుంది. అక్టోబర్ 3వ తేదీన మంగళ గ్రహం తులా రాశిలో ప్రవేశించేసమయానికి ఆ రాశిలో అప్పటికే ఉన్న కేతుతో సంయోగం కానుంది. కేతు అక్టోబర్ 30 వరకూ తుల రాశిలో ఉండటం వల్ల అక్టోబర్ 3 నుంచి 30 వరకూ ఈ ప్రభావం అన్ని రాశులపై పడనుంది. ప్రత్యేకించి మూడు రాశులకు దశ తిరిగిపోనుంది. మంగళ కేతు గ్రహాల యోగంతో ఈ మూడు రాశులకు అద్భుతమైన లాభాలు కలగనున్నాయి. దాంతోపాటు జీవితంలో మంచి రోజులు ప్రారంభమౌతాయి. తులా రాశిలో మంగళ గ్రహం యుతి ఏయే రాశులపై ఎలా ఉంటుందో తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మంగళ కేతు గ్రహాల యుతితో సింహ రాశి జాతకులకు చాలా అనుకూలమైన పరిస్థితి నెలకొంటుంది. రాజకీయాల్లో ఉండేవారికి ఈ సమయం అత్యంత అనుకూలమైందిగా భావిస్తారు. మీ మాట తీరులో మార్పుంటే మంచి జరగవచ్చు. కొత్త అవకాశాలు లాభిస్తాయి. కెరీర్ ఉన్నతంగా ఉంటుంది. వ్యాపారంలో అమితమైన లాభాలు ఆర్జిస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆర్ధికంగా పటిష్టమైన స్థితి కలిగి ఉంటారు. 


మకర రాశి జాతకులపై మంగళ కేతు గ్రహాల యుతి ప్రభావంతో అంతా సానుకూలమైన వాతావరణం ఉంటుంది. అంటే ఏ పని తలపెట్టినా విజయం సాధిస్తారు. వ్యాపారులకు కొత్త అవకాశాలు దక్కుతాయి. లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగులకు కొత్త అవకాశాలు రావడం, పదోన్నతి వంటివి ఉంటాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ఆర్ధికంగా ఎలాంటి సమస్య తలెత్తదు. 


మంగళ కేతు గ్రహాల యుతితో కన్యా రాశి జాతకులకు ఊహించని ఆర్ధిక లాభం కలగనుంది.పెండింగులో ఉన్న డబ్బులు తిరికి చేతికి అందుతాయి. కళ, మీడియా, నటన, పాటలు, మార్కెటింగ్ సంబంధిత రంగాల్లోవారికి చాలా బాగుంటుందని జ్యోతిష్యలు చెబుతున్నారు. ఆర్దిక పరిస్థితి పటిష్టంగా ఉంటుంది. ఒత్తిడి, ఆందోళన దూరమౌతాయి. పెట్టుబడి లాభిస్తుంది. ఊహించని డబ్బులు వచ్చి పడతాయి. 


Also read: Why Friday For Laxmi Devi: శుక్రవారమే లక్ష్మీదేవికి ఎందుకు ప్రత్యేకమో మీకు తెలుసా ?



 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook