Planet Transit 2024: 5 ఏళ్ల తర్వాత కలవబోతున్న బుధుడు-కుజుడు.. ఈ 3 రాశులపై డబ్బు వర్షం..
Grah Gochar 2024: ప్రతి గ్రహం నిర్దిష్ట సమయం తర్వాత తన రాశిని మారుస్తుంది. త్వరలో బుధుడు, కుజుడు మకరరాశిలో కలవబోతున్నారు. దీని కారణంగా కొందరికి అదృష్టం పట్టనుంది. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.
Mangal Budh Yuti 2024 Effect: ఈనెలలో కొన్ని కీలక గ్రహ సంచారాలు జరగబోతున్నాయి. వేద పంచాంగం ప్రకారం, బుధుడు, కుజుడు మకరరాశిలోకి వెళ్లబోతున్నారు. 5 సంవత్సరాల తర్వాత మకరరాశిలో వీరిద్దరి కలయిక జరగబోతుంది. బుధుడు మరియు శుక్రుడు సంయోగం మూడు రాశులవారికి అదృష్టాన్ని మరియు ఐశ్వర్యాన్ని ఇవ్వబోతుంది. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.
మకరరాశి
ఇదే రాశిలో బుధుడు మరియు కుజుడు కలయిక జరగబోతుంది. వీరి సంయోగం లగ్న గృహంలో సంభవించబోతుంది. మీ దాంపత్య జీవితంలో సంతోషం వెల్లివిరిస్తుంది. ఈ సమయంలో పెట్టే పెట్టుబడులు మీకు లాభాలను ఇస్తాయి. మీరు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. కెరీర్ లో పురోగతికి మంచి అవకాశాలు ఉన్నాయి.
ధనుస్సు రాశి
మకరరాశిలో గ్రహాల మైత్రి ధనస్సు రాశి వారికి అదృష్టాన్ని ఇస్తుంది. మీరు ఆర్థికంగా లాభపడతారు. మీ సంపాదన పెరుగుతుంది. మీ మనసులో కోరికలు నెరవేరుతాయి. మీ లైఫ్ పార్టనర్ తో మంచి రొమాంటిక్ సమయాన్ని గడుపుతారు. ఆగిపోయిన పనులు వెనువెంటనే పూర్తవుతాయి. సమాజంలో మీ ప్రాబల్యం పెరుగుతుంది.
Also Read: Shukra Gochar 2024: త్వరలో శని రాశిలోకి శుక్రుడు.. ఈ 3 రాశులవారు జాగ్రత్త..
మేషరాశి
శుక్రుడు మరియు కుజుడు సంయోగం కారణంగా మేషరాశి వారికి మంచి రోజులు మెుదలుకానున్నాయి. మీకు లక్ కలిసి వస్తుంది. నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది. వ్యాపారస్తులు లాభపడతారు. మీ కెరీర్ మునుపటి కంటే బాగుంటుంది. శనిదేవుడు అనుగ్రహం ఉంటుంది. మీరు అప్పుల భారం నుండి బయటపడతారు.
Also Read: Kala Sarpa Dosha: జాతకంలో కాల సర్ప దోషమా? తప్పించుకోవడానికి ఇదొక్కటే మార్గం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook