Lucky Zodiac Signs: హిందూ జ్యోతిష్యం ప్రకారం ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో రాశి పరివర్తనం అవుతుంటుంది. ఆ ప్రభావం అన్ని రాశులపై శుభంగా లేదా అశుభంగా ఉంటుంది. మార్చ్ 12వ తేదీన శుక్రుడు మీనరాశిలో ప్రవేశించాడు. మార్చ్ 13వ మంగళ గ్రహం మిధునరాశిలో ప్రవేశించాడు. ఇక మార్చ్ 15 అంటే ఇవాళ సూర్యుడు మీనరాశిలో ప్రవేశించనున్నాడు. ఈ క్రమంలో గ్రహాల గోచారంతో కొన్ని రాశులకు ఈ నెల చాలా అద్భుతంగా ఉండబోతుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శుక్ర, మంగళ గ్రహాల గోచారంతో ఈ రాశి వారికి తిరుగుండదిక


వృషభ రాశి


ఈ సమయంలో ఈ రాశి జాతకుల ఆదాయం వేగంగా పెరుగుతుంది. మామయ్య తరపు నుంచి ధనలాభం కలుగుతుంది. కళ, సంగీతంలో అభిరుచి మరింతగా పెరుగుతుంది. అంతేకాకుండా..ఈ రాశివారి కుటుంబ జీవితం సుఖమయంగా ఉంటుంది. సంతానం తరపున ఏదైనా గుడ్‌న్యూస్ వింటారు. 


మేష రాశి


జ్యోతిష్యం ప్రకారం గ్రహాల గోచారం ప్రభావం అన్ని రాశుల జీవితాలపై పడుతుంది. కానీ కొన్ని రాశుల జాతకాలపై విశేషంగా ఉండనుంది. ఈ క్రమంలో మేషరాశి జాతకుల జీవితంలో సానుకూల ప్రభావం కన్పిస్తుంది. కుటుంబసభ్యులతో కలిసిమెలిసి ఉంటారు. సహకారం లభిస్తుంది. పరీక్షల్లో విజయం ఉంటుంది. కారు కొనాలనే కోరిక నెరవేరుతుంది. ప్రేమ, పెళ్లి జీవితంలో సుఖ సంతోషాలు ఉంటాయి. ఆదాయం పెరుగుతుంది. 


వృశ్చిక రాశి


ఈ సమయంలో శాంతం, ప్రసన్నత అవలంభిస్తారు. ఉద్యోగంలో సిబ్బంది సహకారం లభిస్తుంది. మీ అభివృద్ధికి మార్గాలు తెర్చుకుంటాయి. ధనలాభం కలుగుతుంది. మిత్రుల సహకారం ప్రాప్తిస్తుంది. ఊహించని ఆర్ధిక లాభాలుంటాయి.


మిధున రాశి


జ్యోతిష్యం ప్రకారం మిధున రాశి జాతకులకు ఈ సమయంలో మీరు అనుకున్న పనులు పూర్తవుతాయి. మీ ఆత్మ విశ్వాసం వృద్ధి చెందుతుంది. కుటుంబంలో ఆద్యాత్మిక కార్యక్రమాలుంటాయి. పనిచేసేచోట మార్పు ఉండవచ్చు. పూర్వీకుల ఆస్థి లభించవచ్చు. ఆర్ధిక ఇబ్బందులు పూర్తిగా దూరమౌతాయి.


Also read: Sun Transit in Pisces 2023: ఇవాళ్టి నుంచి ఆ రాశి జాతకం మారిపోతుంది, కావల్సినంత డబ్బు, పదోన్నతి ఖాయం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook