Conjunction Of Mars And Sun In Virgo 2023: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం..గ్రహాల సంచారాలకు ప్రత్యేక ప్రాముఖ్య ఉంది. కొన్ని సందర్భాల్లో సంచార క్రమంలో ఒకే రాశిలో రెండు గ్రహాలు కలుస్తాయి. దీని కారణంగా మొత్తం 12 రాశులవారిపై ప్రభావం పడుతుంది. అయితే గ్రహాలకు రాజుగా పరిగణించే సూర్యుడు 17 సెప్టెంబర్‌ రోజున కన్యారాశిలోకి సంచారం చేశాడు. ఇప్పటికే గ్రహాల అధిపతిగా వ్యవహరించే కుజుడు కూడా అదే రాశిలో సంచారం చేశాడు. దీంతో కన్యా రాశిలో కుజుడి, సూర్యుడి కలయిక ఏర్పడింది. ఈ ప్రభావం మొత్తం 12 రాశులవారిపై పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. కన్యారాశిలో సూర్యుడు-అంగారకుడు కలయిక వల్ల కొన్ని రాశులవారికి ఆర్థికంగా, వ్యాపారంగా అనేక లాభాలు చేకూరుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేష రాశి:
ఈ గ్రహాల కలయిక కారణంగా మేషరాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. జీవితంలో సంతోషం రెట్టింపు అవుతుంది. అంతేకాకుండా ఆదాయం కూడా పెరిగే ఛాన్స్‌లు ఉన్నాయి. మీపై మీ శుత్రువులు ఓడిపోయే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. ఈ సమయంలో మీరు కార్యాలయాల్లో కొత్త బాధ్యలు కూడా పొందుతారు. ఈ సమయంలో మీ ధన ప్రవాహం కూడా రెట్టింపు అవుతుంది. కానీ వీరు వాహనాలు వాడే క్రమంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. 


Also Read: Etela Rajender: ఓడిపోతే పోరాడి ఓడిపోవాలి.. లొంగేది లేదు.. కొట్లాడేందుకు రెడీ: ఈటల రాజేందర్  


కర్కాటక రాశి:


కర్కాటక రాశి కన్యారాశిలో కుజుడి, సూర్యుని కలయిక ఎంతో ప్రయోజనకరంగా ఉండబోతోంది. ఈ సమయంలో మీ ధైర్యం రెట్టింపు అవుతుంది. అంతేకాకుండా మీపై మీకు విశ్వాసం కూడా పెరుగుతుంది. అంతేకాకుండా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నవారు ఈ సమయంలో శుభవార్తలు వింటారు. అంతేకాకుండా ఈ సమయంలో మీ పిల్లల నుంచి కూడా ఊహించిన ప్రయోజనాలు పొందే ఛాన్స్‌లు ఉన్నాయి. వ్యాపారాలు చేసేవారికి చాలా లాభదాయకంగా ఉంటుంది.


వృశ్చిక రాశి:
కుజుడు-సూర్యుడు కలయిక ఈ రాశివారికి చాలా శుభప్రదమని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ సమయంలో వృశ్చిక రాశివారికి పెండింగ్‌లో ఉన్నపనులు కూడా సులభంగా నెరవేరుతాయి. ఈ సమయంలో వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల ఊహించని లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా నిలిపోయిన డబ్బులు కూడా ఈ సమయంలో రికవరీ అవుతాయి. ఈ సమయంలో సామాజిక ప్రతిష్ట కూడా చాలా రెట్టింపు అవుతుంది. 


Also Read: Etela Rajender: ఓడిపోతే పోరాడి ఓడిపోవాలి.. లొంగేది లేదు.. కొట్లాడేందుకు రెడీ: ఈటల రాజేందర్  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFaceboo