Mangal Gochar 2023: ధైర్యం, శక్తి మరియు భూమికి అంగారకుడు కారకుడు. ఆస్ట్రాలజీలో ఇతనిడి రెడ్ ప్లానెట్ గా పరిగణిస్తారు. అంతేకాకుండా కుజుడిని శుభగ్రహంగా భావిస్తారు. కొత్త సంవత్సరంలో అంటే జనవరి 13న మంగళ దేవుడు తన గమనాన్ని మార్చుకుని సరళ మార్గంలోకి రానున్నాడు. కుజుడు మేషం మరియు వృశ్చిక రాశికి అధిపతి. దీంతో కొన్ని రాశులవారికి మంచి రోజులు ప్రారంభం కానున్నాయి. కుజ సంచారం వల్ల ఏ రాశులవారు లాభపడనున్నారో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వృషభం (Taurus)- కుజ సంచారం వల్ల వృషభ రాశి వారికి ప్రయోజనం కలుగనుంది. ఈ సమయంలో మీ కోరికలు నెరవేరుతాయి. మీరు మీ కుటుంబ సభ్యులు, మిత్రులతో టూర్ కు వెళ్లే అవకాశం ఉంది. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు విజయం సాధిస్తారు. వైవాహిక జీవితం బాగుంటుంది. బిజినెస్ విస్తరిస్తుంది. 
సింహ రాశి (Leo)- కుజ సంచారం వల్ల సింహ రాశి వారికి మేలు జరుగుతుంది. ఈ సందర్భంగా ఆఫీసులో నెలకొన్న వివాదాలు తొలగిపోతాయి. కుజుడు మార్గంలో ఉండటం వల్ల మీరు ఆర్థికంగా సానుకూల ఫలితాలను పొందుతారు. వ్యాపారంలో పెద్ద డీల్ ను కుదుర్చుకునే అవకాశం ఉంది. మీ లక్ష్యాలను మీరు చేరుకుంటారు.


వృశ్చిక రాశి (Scorpio)- కుజుడు మార్గం కారణంగా వృశ్చిక రాశి వారికి శుభం కలుగుతుంది. మీకు మతపరమైన పనుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. అంగారక సంచారం మీకు ఆర్థికంగా సానుకూల పలితాలన ఇస్తుంది. మీరు కెరీర్‌లో అపారమైన పురోగతిని సాధిస్తారు. ఉద్యోగం మారాలనే మీ కోరికలో సఫలీకృతమవుతారు. 
ధనుస్సు (Sagittarius)- కుజుడు మార్గంలో ఉండటం వల్ల మీరు ఆర్థికంగా లాభడతారు. పెట్టుబడులు పెట్టడానికి ఇదే మంచి సమయం. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న యువత కోరికలు నెరవేరుతాయి. మీరు ఆఫీసులో కొత్త బాధ్యతలు తీసుకుంటారు. మీ వైవాహిక జీవితం బాగుంటుంది. మీరు చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. 


Also Read: Bhadra Raj Yoga: న్యూ ఇయర్ లో అరుదైన రాజయోగం.. ఈ 4 రాశులకు లాభాలే లాభాలు.. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.