Mars Transit 2022: ఆస్ట్రాలజీ ప్రకారం, గ్రహాలు ఎప్పటికప్పుడు తమ కదలికలను మారుస్తూ ఉంటాయి. ఫానెట్స్ సంచారం ప్రజలందరిపై పెను ప్రభావాన్ని చూపుతాయి. ఈ నెల 13న వృషభరాశిలో సంచరించిన అంగారకుడు (Mars Transit in Taurus 2022) వచ్చే ఏడాది మార్చి 13 వరకు అక్కడే ఉంటాడు. అంటే దాదాపు 4 నెలలపాటు అదే రాశిలో కుజుడు సంచరించనున్నాడు. వృషభరాశిలో అంగారుకుడి గోచారం వల్ల మూడు రాశులవారు బంపర్ బెనిఫిట్స్ పొందనున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మీనం (Pisces): వృషభ రాశిలో కుజుడు సంచారం మీన రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే ఈ సంచారం మీ రాశి నుండి మూడవ ఇంట్లో జరిగింది. దీంతో మీ ధైర్యం పెరిగింది. మీరు శత్రువులపై విజయం సాధిస్తారు. మీరు కెరీర్ లో అపారమైన పురోగతి సాధిస్తారు. మీరు సోదరసోదరీమణుల సపోర్టు లభిస్తుంది. ఈ సమయంలో మీరు టూర్ వెళ్లే అవకాశం ఉంది.


కన్య (Virgo): వృషభ రాశిలో కుజుడు సంచారం మీకు అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే కుజుడు మీ రాశి నుండి అదృష్ట గృహంలోకి ప్రవేశించాడు. దీంతో మీరు ఉద్యోగంలో ప్రమోషన్ పొందుతారు. అంతేకాకుండా జీతం పెరగడంతోపాటు ఇంక్రిమెంట్ కూడా లభిస్తుంది. ఈసమయంలో ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. మీడియా, సినిమా, మార్కెటింగ్ రంగాలతో సంబంధం ఉన్నవారు లాభపడతారు.


మేషం (Aries): 4 నెలల పాటు వృషభరాశిలో కుజుడు ఉండటం మీకు లాభిస్తుంది. ఈ సమయంలో మీరు ఆకస్మికంగా డబ్బు పొందే అవకాశం ఉంది. నిరుద్యోగులకు జనవరి ప్రారంభంలో ఉద్యోగ అవకాశాలు రావచ్చు ఉద్యోగులు కొత్త బాధ్యతలను పొందుతారు. సహోద్యోగులతో సత్సంబంధాలు మెరుగ్గా ఉంటాయి. మీ కెరీర్‌కు సంబంధించి విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. మీరు మీ సొంత వ్యాపారం ద్వారా లాభపడతారు. ఈరాశికి కుజుడే అధిపతి. కాబట్టి అంగారకుడి సంచారం మీకు శుభదాయకంగా ఉంటుంది.


Also Read: Sun Gochar 2022: నెల రోజులపాటు వృశ్చికరాశిలో సూర్యభగవానుడు... ఈ 3 రాశులవారికి డబ్బుతోపాటు కీర్తి ప్రతిష్టలు పెరగడం ఖాయం..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu      


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook