Samsaptak RajYog: తిరోగమన కుజుడి `సంసప్తక రాజయోగం`.. ఈ 3 రాశులకు వృత్తి-వ్యాపారంలో విజయం..
Samsaptak RajYog: ఆస్ట్రాలజీ ప్రకారం, వృషభరాశిలో కుజుడు సంచరించడం వల్ల సంసప్తక రాజయోగం ఏర్పడుతోంది. ఈ యోగం ఏ రాశి వారికి శుభప్రదంగా ఉంటుందో తెలుసుకోండి.
Samsaptak RajYog: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, గ్రహాలు ఎప్పటికప్పుడు ఒక రాశి నుండి మరొక రాశికి బదిలీ అవుతాయి. ఇది మానవ జీవితం మరియు భూమిపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. కుజుడు తిరోగమన స్థితిలో వృషభరాశిలో సంచరించనున్నాడు. దీనితో పాటు శుక్ర గ్రహం కూడా వృశ్చిక రాశిలో ప్రవేశించనుంది. దీని వల్ల కుజుడు, శుక్రుడు, బుధుడు కలిసి సంసప్తక రాజయోగాన్ని (Samsaptak Rajyog) ఏర్పరుస్తాయి. ఈ యోగం కొన్ని రాశుల వారికి శుభప్రదంగా ఉంటుంది. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.
కర్కాటకం (Cancer): సంసప్తక రాజయోగం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే యోగకారకుడు అయిన కుజుడు మీ సంచార జాతకంలో శుభస్థానంలో కూర్చున్నాడు. దీని కారణంగా మీరు వ్యాపారంలో మంచి లాభాలు సాధిస్తారు. ఆదాయ వనరులు పెరుగుతాయి. అదృష్టం కలిసి వస్తుంది. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. పోలీసు, సైన్యంతో సంబంధం ఉన్న వ్యక్తులు లాభపడతారు.
మకరం (Capricorn): సంసప్తక రాజయోగం మీకు శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే మీ రాశి నుండి శుక్రుడు శుభస్థానంలో కూర్చున్నాడు. అందువల్ల మీరు బిజినెస్ లో భారీగా లాభాలు పొందుతారు. హోటల్, సినిమా, మార్కెటింగ్ మరియు రియల్ ఎస్టేట్ వ్యాపారంతో సంబంధం ఉన్నవారు మంచి లాభాలను సాధిస్తారు. మీరు పిల్లల వైపు నుండి శుభవార్తలు వింటారు.
కుంభం (Aquarius): సంసప్తక రాజయోగం మీకు ఆర్థికంగా మేలు చేస్తుంది. మీరు అదృష్ట కారణంగా డబ్బు సంపాదిస్తారు. కెరీర్ లో విజయం సాధిస్తారు. వ్యాపారంలో పెద్ద డీల్స్ కుదురుతాయి. మీరు ఈ సమయంలో ఏదైనా వాహనం లేదా ఆస్తిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీరు విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. మీ కష్టానికి తగిన ఫలితాలను అందుకుంటారు. మీరు భాగస్వామ్యంతో చేసే పనులు లాభాన్నిస్తాయి.
Also Read: Navpancham Rajyog: 12 ఏళ్ల తరువాత 'నవ పంచమ రాజయోగం'.. ఈ 3 రాశుల వారికి ధనలాభం...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి