Mars Retrograde 2022: అన్ని గ్రహాలు తమ సొంత రాశులు వదిలి ఇతర రాశుల్లోకి తిరోగమనం చెందుతాడు. అయితే దీని వల్ల పలు రాశులపై తీవ్ర ప్రభావం పడే అవకాశాలున్నాయి. అయితే కుజుడు ఈ రోజు తిరోగమనం చెందబోతున్నాడు. దీని కారణంగా మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని పొందే అవకాశాలున్నాయి. అంతేకాకుండా వీరికి ఈ క్రమం తీవ్ర అనారోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి వీరు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించడం చాలా మంచిదని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ సమయంలో ఈ రాశి వారు వ్యాపారంలో అనేక సవాళ్లను ఎదుర్కోవచ్చు. అంతేకాకుండా మానసిక ఒత్తిడికి కూడా లోనయ్యే అవకాశాలున్నాయి. కాబట్టి ఈ క్రమం తప్పకుండా పలు రాకాల జగ్రత్తలు పాటించి ఈ సమస్యలకు చెక్‌ పెట్టాలని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తిరోగమనం వల్ల ఏర్పడే ప్రతికూల ప్రభావాలు:
కుజుడు మిథునం రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. అయితే ఈ ప్రక్రియ  అక్టోబర్ 30 ఆదివారం నుంచి ప్రారంభం కాబోతోంది. దీని ప్రభావం నవంబర్ 13 వరకు ఉంటుంది. తర్వాత కుజుడు వృషభరాశిలోకి తిరోగమనం చెందుతాడు. అయితే ఈ ప్రభావం పలు రకాల రాశులపై పడే అవకాశాలున్నాయి. అయితే ఏయే రాశులవారు ఎలాంటి చెడు ప్రభావం ఎదుర్కొవాల్సి వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..
 
మేషరాశిపై అంగారక గ్రహ ప్రభావం:

కుజుడు తిరోగమనం మేషరాశి వారుపై తీవ్ర ప్రభావవం పడబోతోంది. కుటుబం కలహాలు, మిత్రుల వల్ల తీవ్ర ఇబ్బది పలవుతారని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. వీరు వ్యాపార రంగాల్లో అనేక సవాళ్లను ఎదుర్కోనే అవకాశాలు కూడా ఉన్నాయి. వీరు మానసిక ఒత్తిడికి లోనవడమేకాకుండా ఆర్థిక పరంగా వివిధ రకాల సమస్యలు ఎదుర్కొనే అవకాశాలున్నాయి. కాబట్టి ఈ క్రమంలో చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.


వృషభ రాశిపై ప్రభావం:
ఈ గ్రహ సంచారం వల్ల వృషభ రాశి వారు కూడా తీవ్ర సమస్యలు ఎదుర్కొనే అవకాశాలున్నాయి. ఈ క్రమంలో వృషభ రాశివారు ఏ పనులు చేసిన నష్టపోతారు. అంతేకాకుండా ఈ సంచారం వల్ల కుటుంబ సభ్యులతో వాదనలు పెరగవచ్చని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఆస్తి విషయంలో సోదరుల మధ్య తీవ్ర వివాదాలు రావచ్చు. ఈ వారం రోజులు ఖర్చలు పెరిగే అవకాశాలున్నాయి.


తులారాశిపై అంగారక గ్రహ ప్రభావం:
ఈ తిరో గమన ప్రభావం తీవ్ర దుష్ప్రభావాలకు దారీ తీసే అవకాశాలున్నాయి. అంతేకాకుండా ఈ ప్రభావం భవిష్యత్‌ జీవితంపై కూడా పడే అవకాశాలున్నాయి. కాబట్టి తప్పకుండా వీరు ఈ క్రమంలో పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా పని చేస్తున్న కంపెనీలో యజమాని వీరిపై విరుచుకుపడే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ క్రమంలో వీరు ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.  


Also Read : Chiranjeevi-Garikapati : మళ్లీ వివాదం షురూ.. గరికపాటి మీద చిరంజీవి పరోక్ష సెటైర్లు.. వీడియో వైరల్


Also Read : Jagadish Reddy: మంత్రి జగదీశ్ రెడ్డికి ఈసీ ఝలక్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి